త్వరలో కేటీఆర్​ సీఎం అవుతరు

ఎమ్మెల్యే రాములు నాయక్​

కారేపల్లి, వెలుగు: త్వరలోనే రాష్ట్రానికి కేటీఆర్ సీఎం కాబోతున్నారని వైరా ఎమ్మెల్యే లావుడ్య రాములు నాయక్​ అన్నారు. ఖమ్మం జిల్లా కారేపల్లి మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన టీఆర్ఎస్​పార్టీ ఆఫీస్​ను మంగళవారం ఆయన ప్రారంభించారు. అనంతరం ప్రజాప్రతినిధులు, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్రంలో ఎక్కడా ప్రతిపక్షం లేదని, అధికారంలో ఉన్న టీఆర్ఎస్​నాయకుల్లోనే స్వల్ప విబేధాలున్నాయని చెప్పారు. గ్రామ స్థాయిలో వివిధ కమిటీలను ఏర్పాటుచేసుకుని పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ మాలోత్​ శకుంతల, వైస్​ఎంపీపీ రావురి శ్రీనివాసరావు, ఆత్మ కమిటీ చైర్మన్​ ముత్యాల సత్యనారాయణ, సొసైటీ చైర్మన్​దుగ్గినేని సత్యనారాయణ పాల్గొన్నారు.

కేటీఆర్ ​సీఎం కావాలె: ఎమ్మెల్యే షకీల్

బోధన్​, వెలుగు: వచ్చే  శాసనసభ  సమావేశాల్లో సీఎంగా కేటీఆర్​ఉండాలన్నది తన అభిప్రాయమని  బోధన్​ ఎమ్మెల్యే షకీల్​ అన్నారు.  మంగళవారం నిజామాబాద్ జిల్లా బోధన్​ టౌన్​లోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్​ త్వరలోనే ముఖ్యమంత్రి బాధ్యతలను కేటీఆర్​కు అప్పగిస్తారని తనకు నమ్మకం ఉందన్నారు.

Latest Updates