మెజారిటీ స్థానాల్లో గెలిచాం: కేటీఆర్

ktr-wishes-to-won-mp-candidates

తెలంగాణలో లోక్ సభ ఎన్నికల ఫలితాలు విడుదలైన క్రమంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ఈ ఎన్నికల్లో ప్రజలు తమ పార్టీకి మెజార్టీ స్థానాలు కట్టపెట్టారని అన్నారు. 16 స్థానాలలో గెలవాలని తాము ఆశించామని, మెజార్టీ స్థానాలలో తాము గెలిచామని, ప్రజాస్వామ్యంలో గెలుపోటములు సహజమని అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజాతీర్పు శిరోధార్యమన్నారు.

మిగతా స్థానాల్లో గెలిచిన బీజేపీ, కాంగ్రెస్ మిత్రులకు శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ కోసం, నేతల గెలుపు కోసం కష్టపడ్డ కార్యకర్తలకు కేటీఆర్ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.

 

Latest Updates