రేవంత్‌ రెడ్డికి షాక్.. బెయిల్ పిటిషన్‌ను కొట్టేసిన కోర్టు

మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌ రెడ్డికి ఎదురుదెబ్బ తగిలింది. డ్రోన్ కెమేరా కేసులో రేవంత్‌రెడ్డి బెయిల్‌ పిటిషన్‌‌ను కూకట్ పల్లి కోర్టు కొట్టివేసింది. కేటీఆర్‌ ఫామ్‌హౌస్‌పై డ్రోన్‌ వాడకంపై రేవంత్‌ అరెస్ట్‌ అయ్యారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి చర్లపల్లి జైలులో ఉన్నారు. బెయిల్ పిటిషన్ కొట్టివేత నేపథ్యంలో మరోసారి పిటిషన్‌ దాఖలు చేయడానికి రేవంత్‌ లాయర్లు ప్రయత్నిస్తున్నారు.

కేటీఆర్ ఫామ్ హౌస్ పై డ్రోన్ కెమెరా ఎగురవేసిన ఘటన లో ఎంపీ రేవంత్ రెడ్డి అరెస్టయ్యారు. ప్రస్తుతం చర్లపల్లి జైలులో జ్యూడిషియల్ రిమాండ్ లో ఉన్న రేవంత్  బెయిల్ పిటిషన్ ను కొట్టివేస్తున్నట్టు తెలిపింది న్యాయ స్థానం.

ఈ కేసులో ఎనిమిది మంది పై కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేశారు నార్సింగి పోలీసులు. గత విచారణలో ఐదుగురికి రాజేంద్రనగర్‌ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో డ్రోన్ కెమెరా కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న రేవంత్‌ రెడ్డి బెయిల్‌ పిటిషన్‌పై బుధవారం విచారించిన కోర్టు అతన్ని బెయిల్ పిటిషన్ ను కొట్టివేసింది.

Latest Updates