ఎన్నికలకు సిద్ధంగా ఉండండి: కుమారస్వామి

ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని JDS కార్యకర్తలకు పిలుపునిచ్చారు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి. త్వరలోనే 17 నియోజకవర్గాల ఉపఎన్నికలు జరుగుతాయని చెప్పారు. అలా కాకుండా మొత్తం అసెంబ్లీకే ఎన్నికలు జరిగే అవకాశం కూడా ఉందన్నారు. యెడియూరప్ప ప్రభుత్వం ఎక్కువ కాలం నిలబడబోదన్నారు. ఇప్పుడు JDS కు ఎలాంటి పొత్తులు లేవన్నారు. పొత్తులు, అధికారం తనకు అక్కర్లేదన్న కుమారస్వామి… కార్యకర్తల ప్రేమ కావాలన్నారు.

Latest Updates