సంకీర్ణ సర్కార్ కు షాక్ : గురువారం అసెంబ్లీలో బలపరీక్ష

కొన్ని రోజులుగా కర్ణాటక రాజకీయాల్లో అనిశ్చితి నెలకొంది. ప్రభుత్వం పడిపోకుండా కాంగ్రెస్, జేడీఎస్ నేతలు.. మరికొంత మంది ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకునేందుకు బీజేపీ పోటాపోటీ ఎత్తులు వేశాయి. రాజీనామా చేసిన 14 మంది ఎమ్మెల్యేలు ముంబై లో క్యాంప్ పెట్టగా.. కాంగ్రెస్, జేడీఎస్ లు కూడా తమ ఎమ్మెల్యేలను రహస్య ప్రాంతాలకు తరలించాయి. బీజేపీ కూడా తమ సభ్యులను రిసార్టులో ఉంచింది. కాంగ్రెస్ హైకమాండ్ దూతలు బెంగళూరులోనే ఉండి.. సంకీర్ణ ప్రభుత్వాన్ని నిలుపుకునేందుకు  చర్చలు జరిపారు.

దింది. అయితే కొన్ని గంటల్లోనే యూ టర్న్ తీసుకున్న నాగరాజు… రాజీనామాకే కట్టుబడి ఉన్నానంటూ మళ్లీ ముంబై క్యాంపుకు వెళ్లిపోవడంతో సంకీర్ణ సర్కార్ కు షాక్ తగిలింది. ఇంతలోనే వ్యూహాలకు పదును పెట్టిన యడ్యూరప్ప.. అసెంబ్లీలో ప్రభుత్వం అవిశ్వాస నోటీసు ఇచ్చారు.  బలపరీక్షకు సిద్ధమని సీఎం కుమారస్వామి ప్రకటించడంతో గురువారం అసెంబ్లీలో బలపరీక్ష జరగనుంది.

Latest Updates