10 కోట్ల లోన్ ఇప్పిస్తానని.. కోటిన్నర కొట్టేసిన లాయర్

తనకు బ్యాంకు అధికారులు తెలుసనీ, రూ.10 కోట్ల లోన్ ఇప్పిస్తానని చెప్పి ఓ వ్యక్తి నుంచి భారీ మొత్తంలో డబ్బు గుంజిన లాయర్ ను కర్నూల్ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. కర్నూలు సిసిఎస్ ఇన్స్పెక్టర్ నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం.. ధోన్ పట్టణానికి చెందిన గుజ్జర నాగేశ్వరరావు అనే లాయర్ అదే ప్రాంతానికి చెందిన సముద్రాల బాలాజి అనే వ్యక్తికి ICICI బ్యాంకు నుంచి రూ.10 కోట్లు ఇప్పిస్తానని నమ్మబలికాడు. సదరు బ్యాంకు అధికారులు తనకు తెలుసనీ, వాళ్ల ద్వారా లోన్ మంజూరు చేస్తానని చెప్పాడు. అందుకోసం కొంత ఖర్చు అవుతుందని చెప్పగా.. అతని మాటలు నమ్మిన బాలాజి రూ.47 లక్షలు ఆ లాయర్ కు ఇచ్చాడు. ఆ తర్వాత అప్పుగా రూ.కోటి ఇచ్చాడు. ఆ లాయర్ కు చెందిన SBI, ICICI బ్యాంకు అకౌంట్ల ద్వారా 2010 నుంచి 2015 వరకు ఈ మొత్తాన్ని ట్రాన్సఫర్ చేశాడు. బాలాజిని నమ్మించేందుకు సత్యనారాయణ, ప్రసాద్ అనే ఇద్దరు వ్యక్తులను బ్యాంక్ ఆఫీసర్లుగా పరిచయం చేసి,  బాలాజీకి  లోన్ మంజూరు చేసినట్టుగా ICICI బ్యాంక్ పేరుతో ఉన్న ఓ లెటర్ ను అందజేశాడు.  అది నకిలీ లెటర్ అని తెలుసుకున్న బాలాజీ తాను మోసపోయానని గ్రహించి జిల్లా పోలీసులను ఆశ్రయించాడు.

అతని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నాగేశ్వరరావును శనివారం సాయంత్రం కర్నూల్ లోని గాయత్రి ఎస్టేట్ బస్ స్టాప్ వద్ద అరెస్ట్ చేశారు. అతనిపై ఐపీసీ 403, 406, 468, 471, 506 రెడ్ విత్ 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అదే రోజు రాత్రి ఢోన్ కోర్టులో హాజరు పరచగా జడ్జి అదేశాల మేరకు 15 రోజుల రిమాండ్ నిమిత్తం సబ్ జైలు కి తరలించారు. గతంలో కూడా నాగేశ్వరరావు ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి గుంతకల్లు కు చెందిన కొంతమందిని మోసం చేసినట్టు డోన్ పోలీస్ స్టేషన్ కేసు నమోదు అయిందని ఇన్స్పెక్టర్ నాగరాజు తెలిపారు. ఆ లాయర్ ఇంకా కొందరిని మోసం చేసి ఉండవచ్చని ఆయన అన్నారు.

See More News

రైల్లో పరిచయం.. లాడ్జిలో అత్యాచారం

క్యాన్సర్ బాధితుల కోసం పూజాహెగ్డే సాయం

బ్రష్ చేసేప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

Latest Updates