అన్న కాంటీన్ల కోసం.. జగన్ కాళ్లు మొక్కేందుకు సిద్ధం

కర్నూలు:  అన్న కాంటీన్ల మూసివేత ను నిరసిస్తూ.. కర్నూలు మాజీ మేయర్ బంగి అనంతయ్య వినూత్న నిరసన చేపట్టారు. భిక్ష పాత్ర తీసుకుని.. జిల్లా కలెక్టరేట్ పరిసర ప్రాంతాలలో ఇల్లిల్లూ తిరిగి భిక్షాటన చేశారు. పేద ప్రజల ఆకలి తీర్చేందుకు టీడీపీ ప్రవేశపెట్టిన అన్న కాంటీన్లను వైసీపీ ప్రభుత్వం మూసివేయడం అన్యాయమన్నారు. పేదల ఆకలి తీర్చే విషయంలో రాజకీయాలు వద్దని , టీడీపీ మీద కోపం ఉంటే పేర్లు మార్చుకోమని జగన్ కు హితవు పలికారు.

అన్న కాంటీన్ల తెరిచే వరకు నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తానని .. అవసరమైతే చంద్రబాబు తో మాట్లాడి రాష్ట్రమంతటా ఉద్యమాలు చేసేలా ఉద్యమిస్తానని అనంతయ్య అన్నారు.  అన్న కాంటీన్లను జగన్ తెరుస్తానంటే.. జగన్ కాళ్ళు పట్టుకునేందుకు సిద్ధమని ఆయన అన్నారు.రాజకీయాలు కు అతీతంగా పేర్లు మార్చి అయినా అన్న కాంటీన్లని తెరవాలి.. రూ.5 కె టిఫిన్.. భోజనాలు పెట్టి పేదల ఆకలి తీర్చాలని అనంతయ్య అన్నారు.

Latest Updates