టీడీపీకి కర్నూల్ ఎంఎల్‌సీ రాజీనామా

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటినుంచి రాజకీయ వలసలు పెరిగాయి. ప్రతిపక్ష టీడీపీ నేతలు పార్టీని వదిలి.. వైసీపీలో చేరుతున్నారు. తాజాగా కర్నూల్ జిల్లా ఎంఎల్‌సీ కేఈ ప్రభాకర్ కూడా అదే దారిలో నడవనున్నారని తెలుస్తోంది. ఇప్పటికైతే ఆయన టీడీపీ సభ్యత్వానికి, పదవికి రాజీనామ చేశారు. భవిష్యత్తులో ఏ పార్టీలో చేరతారనేది కార్యకర్తలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని ఆయన అన్నారు. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కర్నూల్ మున్సిపల్ కార్పొరేషన్‌లో తన అనుచరులకు సీట్లు కేటాయించకపోవడంతో ఆయన కలత చెందారు. అందుకే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఆయన తెలిపారు. కేఈ రాజీనామాతో కర్నూల్‌లో టీడీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లే. ఈ రోజు మధ్యాహ్నం కార్యకర్తలతో ఆయన భేటీ కానున్నారు.

కేఈ ప్రభాకర్.. తెలుగుదేశం పార్టీ హయాంలో డిప్యూటీ సీఎంగా పనిచేసిన కేఈ కృష్ణమూర్తి సోదరుడు. కర్నూల్ ఎంఎల్‌సీ శిల్పాచక్రపాణి రెడ్డి టీడీపీకి రాజీనామా చేయడంతో.. అప్పటి సీఎం చంద్రబాబునాయుడు ప్రభాకర్‌కు ఎంఎల్‌సీ పదవి ఇచ్చారు.

For More News..

రేవంత్ కేసు కోసం ఢిల్లీ నుంచి ప్రముఖ న్యాయవాది

సింధియాకు షాక్.. 6 ఏళ్ల క్రితం కేసు రీఓపేన్

పీసీసీ చీఫ్ నువ్వా.. నేనా..

ఇండియాలో కరోనా తొలి మరణం

అప్పుడు కేసీఆర్‌‌ను బండ బూతులు తిట్టిన

Latest Updates