లంచం తీసుకుంటూ పట్టుబడ్డ తహశీల్దార్

లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు ఓ తహశీల్దార్. కర్నూలు జిల్లా సంజామల మండలానికి చెందిన తహశీల్దార్ ఆర్.గోవింద్ సింగ్ ఓ రైతునుంచి ఐదువేల లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. రైతు జె.రామేశ్వరరెడ్డి తన పొలం పాసుబుక్కును ఆన్ లైన్ చేసేందుకు గతంలో ఒకసారి లంచం డిమాండ్ చేశాడు. అప్పుడు ఇచ్చినా సరిపోలేదని… రెండో సారి  డిమాండ్ చేశాడు దీంతో… ఏసీబీ ఆశ్రయాంచాడు రామేశ్వర్ రెడ్డి. దీంతో వలపన్నిన ఏసీబీ అధికారులు తహశీల్దార్ గోవింద్ సింగ్ ను పట్టుకున్నారు.  కెమికల్ టెస్ట్ లో లంచం  తీసుకున్నట్లు పాజిటివ్ రిజల్ట్ వచ్చిందని ఏసీబీ అధికారులు తెలిపారు. సంబంధిత రికార్డులను స్వాధీనం చేసుకుని సీజ్ చేశామని కర్నూలు ఏసీబీ డీఎస్పీ నాగభూషనం చెప్పారు.

Latest Updates