98 ఏళ్ల వయస్సులో స్కైడైవింగ్

సంకల్పం ఉంటే సాధించలేనిది ఏదీ లేదని నిరూపించారు 98 ఏళ్ల వయస్సున్న ఓ వ్యక్తి. ప్రస్తుత పరిస్థితిలో ఏజ్ తో సంబంధం లేకుండానే మనుషులు రోగాల భారిన పడుతున్నారు. అయితే అమెరికాకు చెందిన 98 ఏళ్ల కైల్ రైస్…ఇప్పటికే ఎంతో హుశారుగా..చలాకీగా ఉంటారు. అంతేకాదు ఈ ఏజ్ కూడా హాయిగా స్కైడైవింగ్ చేసేస్తున్నారు. తాజాగా నెదర్లాండ్స్ లోని గ్రోస్ బీక్ ప్రాంతంలో ఓ విమానం ద్వారా 42.4 మీటర్లు స్కై డైవింగ్ చేశారు.

అమెరికా పౌరుడైన రైస్ 1939-45 మధ్య జరిగిన రెండో ప్రపంచయుద్ధంలో పాల్గొన్నారు. ఫ్రాన్స్ లో శత్రువులు ఆక్రమించుకున్న భూభాగాన్ని విముక్తం చేసేందుకు జరిగిన పోరాటంలో వీరోచితంగా పోరాడారు. ఈ ఘటన జరిగి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కైల్  రైస్  మరోసారి స్కైడైవింగ్ చేశాడు. అన్నట్లు తన వందేళ్లు వచ్చేవరకూ స్కైడైవింగ్ చేస్తూనే ఉంటానని తెలిపారు కైల్  రైస్.

Latest Updates