ఇండియా నుంచి ఒకే ఒక్కడు రోహిత్..

ముంబై: స్పెయిన్‌ కు చెందిన ప్రఖ్యాత ఫుట్‌ బాల్‌ లీగ్‌ ‘లా లీగా’కు టీమిండియా వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ బ్రాండ్‌ అంబాసిడర్‌ గా వ్యవహరించనున్నాడు. దీంతో ఈ లీగ్‌ కు నాన్‌ ఫుట్‌ బాల్‌ అంబాసిడర్‌ గా ఇండియా నుంచి ఎంపికైన తొలి ప్లేయర్‌ గా హిట్‌ మ్యాన్‌ నిలిచాడు. ఈ ఘనత దక్కడంపై సంతోషం వ్యక్తం చేసిన ముంబైకర్‌ .. ఫుట్‌ బాల్‌ మ్యాచ్‌ లంటే తనకు ఇష్టమని చె ప్పాడు. ‘నేను పెరుగుతున్నప్పుడు చాలా మ్యాచ్‌ లు చూశా. క్రికెట్‌ నుంచి బ్రేక్‌ తీసుకున్నప్పుడు వీటిని చూసి సేద తీరుతా. జిన్‌ దిన్‌ జిదానే నా ఫేవరెట్ ఫుట్‌ బాలర్‌ . ఫేవరెట్‌ టీమ్‌ రియల్‌ మా డ్రిడ్‌ . ఈ టీమ్‌ చాం పియన్స్‌‌ లీగ్‌ గెలవాలని కోరుకుంటున్నా. ఫిఫా వరల్డ్‌ కప్‌ ను స్పెయిన్‌ గెలవాలి’ అని రోహిత్‌ పేర్కొన్నాడు. టీమిండియాలో అందరికంటే బెస్ట్‌‌ ఫుట్‌ బాల్‌ ప్లేయర్‌ ధోనీ అని చె ప్పాడు. శ్రేయస్‌ , రాహుల్‌ , హార్దిక్‌ రెగ్యులర్‌ గా ఫుట్‌ బాల్‌ ప్లేయర్స్‌‌ హెయిర్‌ స్టైల్స్‌‌ను ట్రై చేస్తుంటారన్నాడు. గత ఐదేళ్లలో ఇండియా ఫుట్‌ బాల్‌ లో చాలా మార్పు లు జరిగాయని చెప్పిన రోహిత్‌ .. గతంలో కంటే పోటీతత్వం పెరిగిందన్నాడు. ఐఎస్‌ ఎల్‌ వల్ల చాలా మంది స్టార్లు తమను తాము నిరూపించుకుంటున్నారని తెలిపాడు.

Latest Updates