కరోనా ఎఫెక్ట్.. పాతబస్తీ బంద్

హైదరాబాద్‌: న‌గ‌రంలో కరోనా మ‌హ‌మ్మారి అంతకంతకూ పెరుగుతుండటం అన్ని వర్గాలను ఆందోళనకు గురి చేస్తోంది. ముఖ్యంగా క‌రోనా కార‌ణంగా త‌మ బిజినెస్ చాలావ‌ర‌కు దెబ్బ‌తిన్న‌ద‌ని చిన్నా చిత‌క వ్యాపారులు అంటున్నారు. వైర‌స్ వ్యాప్తిని నియంత్రించేందుకు త‌మ వంతుగా స్వ‌చ్ఛంధంగా షాపులు మూసివేస్తున్న‌ట్టు కొన్ని మ‌ర్చంట్ అసోసియేష‌న్‌లు పేర్కొన్నాయి. బేగంబ‌జార్ ఈ ఆదివారం నుండి జులై 5 వ‌ర‌కు మూసివేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. తాజాగా పాతబస్తి చార్మినార్ సమీపంలొని లాడ్ బజార్ మర్చంట్ అసోసియేషన్ కూడా స్వచ్చందముగా 15 రోజుల పాటు తమ దుకాణాలను మూసివేసి బందును పాటిస్తున్నారు.

చార్మినార్ చుట్టు ఉన్న ఇస్లామిక్ బుక్స్ షాపు యజమానులు సైతం స్వచ్చందంగా దుకాణాలు మూసివేశారు. పత్తర్ ఘట్టి ప్రాంతంలో కూడా కొంతమంది షాపు యజమానులు కరొనా వైరస్ వ్యాప్తి కారణంగా షాపులు తెర‌వ‌లేదు. దీంతో చార్మినార్ ప్రాంతంలొ జన సముదాయం భారీగా తగ్గింది. అత్య‌వ‌స‌ర ప‌నులున్న వాళ్లు మాత్రం సైకిళ్ల‌పై, బైక్‌ల‌పై బ‌య‌ట‌కు వెళుతున్నారు.

Latest Updates