కార్మికుల కోసం కొత్త పథకాలు…

రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి

కార్మికులకు ఉపయోగపడే సంక్షేమ పథకాలను తీసుకురావాలని అధికారులకు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి సూచించారు. శనివారం హైదరాబాద్‌‌‌‌లో కార్మిక సంక్షేమ మండలి మూడో సర్వసభ్య సమావేశంలో మాట్లాడారు. కార్మిక సంక్షేమ మండలిని బలోపేతం చేయాలని, వాళ్ల కుటుంబాలకు ఉపాధి కల్పించేందుకు కుట్టు మిషన్‌‌‌‌ శిక్షణకు ట్రైనర్‌‌‌‌ను నియమించాలని సూచించారు. సభ్యత్వ రుసుము కింద కార్మికులు రూ.30, యాజమాన్యాలు రూ.70 చెల్లించేలా ప్రభుత్వానికి నివేదిస్తామని చెప్పారు. సంక్షేమ మండలి కార్యక్రమాలను పర్యవేక్షించేందుకు జాయింట్‌‌‌‌ కమిషనర్‌‌‌‌ను నియమించాలనే ప్రతిపాదనలను సర్కార్‌‌‌‌కు పంపిస్తా మని తెలిపారు. కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శి శశాంక్‌‌‌‌ గోయల్‌‌‌‌, కమిష నర్‌‌‌‌ అహ్మద్‌‌‌‌ నదీమ్‌‌‌‌ పాల్గొన్నారు.

Latest Updates