తాండూరులో కూలీల ప్రాణాలు తీస్తున్నకల్తీ కల్లు

తాండూర్ మున్సిపల్ పరిధిలోని వివిధ వార్డుల్లో దాదాపు 25 కల్తీ కల్లు దుకాణాలు అనుమతిలేకుండా కొనసాగుతున్నా యి. తాం డూరు ఈత కల్లు సొసైటీకి ఎక్సైజ్ శాఖ నాలుగు దుకాణాలకు మాత్రమే అనుమతి ఇచ్చింది. కానీ ఈత కల్లు సొసైటీ వ్యాపారులు అక్రమంగా 25 దుకాణాలు ఏర్పాటు చేసి కల్తీ కల్లు విక్రయిస్తున్నా రు. వేసవిలో ప్రజలకు తాగడానికి, కనీస అవసరాలకు తీవ్ర నీటి కొరత ఏర్పడింది. దీంతో ఇతర చోట్ల నుంచి కలుషిత నీళ్లను తీసుకొచ్చికృత్రిమ కల్తీ కల్లును తయారు చేసి ప్రజలకు విక్రయిస్తున్నారు. వేసవిలో ఈత చెట్లకు తక్కువగా కల్లు వస్తుంది కానీ కల్తీ కల్లు తయారు చేసే కాంట్రాక్టర్లు కృత్రిమ కల్తీ కల్లు తయారుచేసి ప్రజలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు.గతంలో కల్తీ కల్లు సేవించి దాదాపు ఐదుగురు మృత్యువాత పడ్డారు. అనేకమంది ఆస్పత్రి పాలయ్యారు. దీనిపై ఎక్సైజ్ శాఖ సమగ్ర విచారణ జరిపినా బాధ్యులపై చర్యలు తీసుకోలేదు. వారి లైసెన్సులను రద్దు చేయలేదు. ఫలితంగా కల్తీ కల్లుజోరుగా సాగుతోంది. దాదాపు 15 వేల మంది దినసరి కూలీలు వివిధ పరిశ్రమల్లో పని చేస్తారు.అలాగే భవన నిర్మా ణాల కోసం కూలీలంతా తాండూరుకు రాకపోకలు సాగిస్తారు. వీరంతా కల్తీ కల్లుకు బానిసలవుతున్నారు. ఈ కల్లు తాగగానే కూలీలు ఎక్కడపడితే అక్కడే రోడ్లపై పడి మత్తులో నిద్రపోతున్నా రు. దీంతో ప్రమాదాలకు గురవుతున్నారు. అయినా ఎక్సైజ్ శాఖచర్యలు తీసుకున్న దాఖలాలు లేవు.

వేసవిలోకల్తీ కల్లుకు భలే గిరాకీ ఉంది. మార్కెట్లో వాటర్ బాటిల్ రూ.20లు. అదే కల్తీకల్లు సీసాను రూ.20కు విక్రయిస్తున్నా రు. దీంతో వాటర్ బాటిల్ కంటే కల్లు సీసా మేలని కూలీలంతా కల్తీ కల్లు సేవిస్తున్నా రు. తెలంగాణలోని ప్రసిద్ధి చెందిన భద్రేశ్వర జాతర తాండూరులో జరుగుతుంది. వివిధ రాష్ట్రాల నుంచి వారం రోజులపాటు భక్తులు ఇక్కడ మకాం వేసి దైవ దర్శనం చేసుకుంటారు.అధికంగా కర్ణాటక రాష్ట్రం నుంచి భారీగా ప్రజలు తరలి వస్తారు. దీనిని అవకాశంగా తీసుకొని కల్తీకల్లు వ్యాపారులు విచ్చలవిడిగా విక్రయాలు కొనసాగిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం భద్రేశ్వర జాతర సందర్భంగా రెండు రోజుల పాటు మద్యం , కల్లు దుకాణాలను మూసివేస్తారు. కానీ ఎక్సైజ్ శాఖ పరోక్ష మద్దతుతో భద్రేశ్వర జాతరలో విచ్చలవిడిగా సాగుతున్నా యి. జాతరకు వచ్చి నప్రజలతో కల్లు దుకాణాలు కిటకిటలాడుతున్నా-యి. ఏడాది సంపాదన వారం రోజుల్లోనే భర్తీ చేసుకోవడానికి కల్తీ కల్లు వ్యాపారులు జోరుగా కల్తీకల్లును ప్రజలకు విక్రయిస్తున్నా రు. ఇప్పటికైనా ప్రభుత్వం కల్తీ కల్లు కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Latest Updates