ఇది రూ.1060 కోట్ల ఇంద్రభవనం

అది చూడ్డా నికి ఇంద్రభవనంలా ఉంటుంది. చుట్టూ గార్డెన్లు . ఎటుపోయినా చల్లటి గాలిని అందించి హాయినిచ్చే పచ్చదనం. అలాంటి బిల్డింగుకు ఎంత పెట్టినా తక్కువే. అందుకే అమెరికాకు చెందిన ఓ వ్యక్తి రూ.1,060 కోట్లకు దాన్ని కొనేశాడు. దీంతో కాలిఫోర్నియాలోనే ఇంత పెద్ద మొత్తంలో ధర పలికిన భవనంగా రికార్డు సృష్టించింది. లాస్‌ ఏంజిలిస్‌ సమీపంలోని బెల్‌ ఎయిర్‌ ఎస్టేట్‌ కు దగ్గర్లో ఉన్న ఈ చార్ట్‌‌‌‌‌‌‌‌వెల్‌ ఎస్టేట్‌ ను మీడియా పెద్ద రూపర్ట్‌‌‌‌‌‌‌‌ ముర్డోక్‌ కొడుకు లచ్లాన్‌ 15 కోట్ల డాలర్ల(రూ.1,060 కోట్లు )కు కొనుగోలు చేశారు. అసలు దీనికింత క్రేజ్‌ రావడానికి కారణమేంటంటే… అమెరికాలో ఫేమస్‌ అయిన ‘ది బెవెర్లీ హిల్‌ బిల్లీస్ ’ కామెడీ షోను ఇందులోనే చేశారు. 1962 నుం చి 1971 వరకు ఈ షో ఇందులో జరిగింది. దాం తో భవనం విలువ విపరీతంగా పెరిగిపోయిం ది. ఈ భవనాన్ని 1930లో 25,000 చదరపుటడుగుల విస్తీర్ణంలో లైమ్‌ స్టోన్‌ తో నిర్మించారు. తర్వాత 1980లో ఫ్రెంచ్‌ ఇంటీరియర్‌ డిజైనర్‌ హెన్రీ శామ్యూల్‌ దీన్ ని రెనోవేట్‌ చేశారు. ఇందులో 18 బెడ్‌ రూమ్స్‌ , 24 బాత్‌ రూమ్స్‌ , బాల్‌ రూమ్‌ , 5బెడ్‌ రూమ్స్ ఉన్న గెస్ట్‌‌‌‌‌‌‌‌హౌస్‌ , 75 అడుగుల పూల్‌ హౌస్‌ , టెన్నిస్‌ కోర్టు , 40 కార్లు పార్కిం గ్‌ చేసుకోవడానికి వీలుండే కార్‌ గ్యాలరీ, 12,000 వైన్‌ బాటిల్స్‌ ఉంచగల బార్‌ ఉన్నాయి. ఈ భవనం నుం చి సిటీ, పసిఫిక్‌ మహాసముద్ర సుందర దృశ్యాలను చూడొచ్చు.

Latest Updates