ఫ్యామిలీతో స్పెండ్ చేస్తున్నా..కానీ పార్ట్‌‌‌‌నర్ లేకపోవడం ప్రాబ్లమే

న్యూఢిల్లీ:ఎంసీ మేరీకోమ్‌‌‌‌. ఇండియా లెజెండరీ బాక్సర్. ఆరుసార్లు వరల్డ్‌‌‌‌ చాంపియన్. మహిళల బాక్సింగ్‌‌‌‌లో ఎన్నో రికార్డులు బద్దలు కొట్టింది. నలుగురు పిల్లలకు జన్మనిచ్చినా, నాలుగు పదుల వయసుకు దగ్గరవుతున్నా కెరీర్ కొనసాగిస్తోందామె. ఒలింపిక్స్‌‌‌‌లో గోల్డ్‌‌‌‌ నెగ్గాలన్న కలను సాకారం చేసుకునేందుకు 37 ఏళ్ల ఏజ్‌‌‌‌లో కఠోర సాధన చేస్తోంది. కానీ, కరోనా కారణంగా టోక్యో ఒలింపిక్స్‌‌‌‌ వచ్చే ఏడాదికి వాయిదా పడ్డాయి. అనూహ్యంగా వచ్చిన ఈ విరామ సమయాన్ని కుటుంబ సభ్యులతో కలిసి ఆస్వాదిస్తోందామె. ప్రత్యర్థులపై పంచ్‌‌‌‌లు విసిరిన చేతులతో తన పిల్లలకు కమ్మగా వండి పెడుతోంది. అదే టైమ్‌‌‌‌లో వచ్చే ఒలింపిక్స్‌‌‌‌ కోసం ప్రిపరేషన్స్‌‌‌‌ కొనగిస్తున్నానని మేరీ చెబుతోంది. లాక్‌‌‌‌డౌన్‌‌‌‌లో తన లైఫ్, టోక్యో ఒలింపిక్స్‌‌‌‌ ప్రిపరేషన్స్‌‌‌‌ గురించి ఓ ఇంటర్వ్యూలో చెప్పిన విశేషాలు ఆమె మాటల్లోనే…

కమ్మగా వండి పెడుతున్నా

ఈ లాంగ్‌‌‌‌ బ్రేక్‌‌‌‌లో ఫ్యామిలీతో కలిసి క్వాలిటీ టైమ్‌‌‌‌ స్పెండ్ చేస్తున్నా. ఇంటి పనులు చేస్తున్నా. మా పిల్లల కోసం రకరకాల రెసెపీలు, స్నాక్స్‌‌‌‌ తయారు చేయడం నాకు చాలా ఇష్టం. ఈ టైమ్‌‌‌‌లో వాళ్లకు కమ్మటి వంటలు వండిపెడుతున్నా. దాంతో ఇంతకుముందు కంటే ఎక్కువ తింటున్నారు. వాళ్లతో కలిసి ఆడుకుంటున్నా. పాటలు పాడుతూ, డ్యాన్స్‌‌‌‌ చేస్తూ ఈ బ్రేక్‌‌‌‌ను ఎంజాయ్‌‌‌‌ చేస్తున్నా. అయినా ట్రెయినింగ్ మిస్సవడం లేదు. ఇంట్లోనే ట్రెయినింగ్‌‌‌‌ తీసుకోవడంతో పాటు.. రెగ్యులర్ ఫిట్‌‌‌‌నెస్‌‌‌‌ ఎక్సర్సైజెస్‌‌‌‌ చేస్తున్నా. ఏదేమైనా కరోనా మహమ్మారి మాకు కూడా అనేక రకాలుగా సవాల్‌‌‌‌ విసురుతోంది. నాతో పాటు నా ఫ్యామిలీ ఇబ్బంది పడుతోంది. ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ ఊహించలేదు. దీనికి అలవాటు పడక తప్పదు.

పార్ట్‌‌‌‌నర్ లేకపోవడం ప్రాబ్లమే

లాక్‌‌‌‌డౌన్‌‌‌‌ నిబంధనలు సడలించడంతో కొన్ని స్పోర్ట్స్‌‌‌‌లో ఔట్‌‌‌‌ డోర్ ట్రెయినింగ్‌‌‌‌ స్టార్ట్‌‌‌‌ అయింది. కానీ, ఒలింపిక్స్‌‌‌‌కు ప్రిపేర్ అవుతున్న బాక్సర్ల నేషనల్‌‌‌‌ క్యాంప్‌‌‌‌ ఆలస్యం అవుతోంది. కాంటాక్ట్‌‌‌‌ స్పోర్ట్‌‌‌‌ కావడంతో ట్రెయినింగ్‌‌‌‌లో స్పారింగ్‌‌‌‌ పార్ట్‌‌‌‌నర్(ప్రాక్టీస్‌‌‌‌ పార్ట్‌‌‌‌నర్)కు అనుమతి ఇవ్వలేదు. ఇది బాక్సర్లందరికీ సమస్యే. స్పారింగ్‌‌‌‌ పార్ట్‌‌‌‌నర్ అనేది బాక్సింగ్‌‌‌‌లో అంతర్గత భాగం. పార్ట్‌‌‌‌నర్‌‌‌‌తో ప్రాక్టీస్‌‌‌‌ చేస్తేనే కొత్త విషయాలు నేర్చుకుంటాం. కొత్త ఆలోచనలు వస్తాయి. కౌంటర్ స్కిల్స్‌‌‌‌ పెంచుకుంటాం. కాబట్టి స్పారింగ్‌‌‌‌ పార్ట్‌‌‌‌నర్ లేకపోవడం కచ్చితంగా సమస్యే.

2012 మోటివేషన్‌‌‌‌.. 2021 మరో చాన్స్‌‌‌‌

2012 ఒలింపిక్స్‌‌‌‌లో నేను బ్రాంజ్‌‌‌‌ మెడల్‌‌‌‌ నెగ్గా. కెరీర్​లో మరింత ముందుకెళ్లేందుకు అది నన్ను ఎంతగానో మోటివేట్‌‌‌‌ చేసింది. నా కల (ఒలింపిక్‌‌‌‌ గోల్డ్‌‌‌‌) నెరవేర్చుకునేందుకు వంద శాతం కృషి చేస్తా. టోక్యోలో నా బెస్ట్‌‌‌‌ ఇచ్చి దేశానికి కీర్తి ప్రతిష్టలు తీసుకొస్తానని ఆశిస్తున్నా.

ఒలింపిక్స్‌‌‌‌ పోస్ట్‌‌‌‌పోన్‌‌‌‌ ఓకే

ఈ సిచ్యువేషన్‌‌‌‌లో ఒలింపిక్స్‌‌‌‌ను వచ్చే ఏడాదికి పోస్ట్‌‌‌‌పోన్‌‌‌‌ చేయడం సరైన నిర్ణయమే. ఇలా జరగడంతో నా ఒలింపిక్స్‌‌‌‌ ప్లాన్స్‌‌‌‌ మొత్తం డిస్టర్బ్‌‌‌‌ అయ్యాయి. కానీ, ఈ విషయంలో మనం చేసేదేమీ లేదు. కాబట్టి నేను చాలా పాజిటివ్‌‌‌‌గా ఉన్నా. ఏదైనా మన మంచి కోసమే అని నమ్ముతున్నా. ఒలింపిక్స్‌‌‌‌కు ప్రిపేర్ అయ్యేందుకు నాకు మరింత సమయం లభించిందనే నిజాన్ని నేను ఒప్పుకోవాలి. ఈ టైమ్‌‌‌‌ను సద్వినియోగం చేసుకొని వరల్డ్‌‌‌‌ బెస్ట్‌‌‌‌ ప్లేయర్లను ఎదుర్కొనేందుకు బాగా ప్రిపేర్ అవ్వాలి. ప్రస్తుతానికైతే పరిస్థితులు త్వరగా సాధారణ స్థితిలోకి రావాలని కోరుకోవాలి. ఆ తర్వాతే ప్రిపరేషన్స్‌‌‌‌ స్టార్ట్‌‌‌‌ చేయొచ్చు.

సీరియస్‌‌‌‌నెస్​ ఉండాలి

బాక్సింగ్‌‌‌‌ అయినా మరే స్పోర్ట్‌‌‌‌ అయినా కేవలం ఆహ్లాదానికి మాత్రమే కాదు, బెస్ట్‌‌‌‌ కెరీర్ ఆప్షన్స్‌‌‌‌ అని నేనెప్పుడూ చెబుతుంటా. ఆటను కెరీర్‌‌‌‌గా ఎంచుకుంటే మీకు (యంగ్‌‌‌‌స్టర్స్‌‌‌‌కు) మంచి ఫ్యూచర్ ఉంటుంది. పేరు, డబ్బు సంపాదించుకోవచ్చు. వీటన్నింటికి మించి దేశానికి కీర్తి ప్రతిష్టలు తీసుకురావొచ్చు. అందువల్ల మీలో నైపుణ్యం ఉండి, ఆటలో ముందుకెళ్లాలని అనుకుంటే అవకాశాన్ని రెండు చేతులతో ఒడిసిపట్టుకోండి. ఆటలో రాణించేందుకు కృషి చేయండి. కానీ, ఒక్కటి గుర్తుంచుకోండి. ప్రతీ చోట కాంపిటీషన్స్‌‌‌‌ చాలా టఫ్‌‌‌‌గా ఉన్నాయి. సీరియస్‌‌‌‌గా తీసుకోకపోతే ఈ పోటీ ప్రపంచంలో ఏదీ సాధించలేం.

ఫిక్సింగ్ ను ఇండియాలో క్రైమ్ గా చూడాలి

Latest Updates