యూరియా కోసం ఐదు రోజులుగా పడిగాపులు

యూరియాను అందించాలంటూ గురువారం  రోడ్డెక్కారు ఆదిలాబాద్ జిల్లా కడెం మండల రైతులు. ఐదు రోజుల్నుంచి అగ్రికల్చర్ ఆఫీస్​ ముందు పడిగాపులు పడుతున్నా యూరియా దొరకలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

మండలానికి సరిపడా యూరియా తెప్పించాలంటూ బాసర‌‌‌‌- మంచిర్యాల హైవే మీద మూడు గంటల పాటు రాస్తారోకో చేయడంతో పెద్దపెట్టున ట్రాఫిక్ నిలిచిపోయింది. రెండ్రోజుల్లో 100 మెట్రిక్ టన్నుల యూరియా రావాల్సి ఉందని.. అది రాగానే అందిస్తామని ఏవో సంధ్యారాణి చెప్పడంతో ఆందోళన విరమించారు.

– ఖానాపూర్, వెలుగు

Latest Updates