మహిళా సర్పంచి వినూత్న ఆలోచన

ఇంటి ముంగిట 50 రకాల మొక్కల పెంపకం

సిద్దిపేట, వెలుగు: ఇంటి ముందు పెద్ద ప్లేస్‌ ఉంటే బాగుండు రకరకాల పూల మొక్కలు పెంచేవాళ్లం అని చాలా మందిచెప్తుంటరు. కానీ దానికి పెద్ద ప్లేస్‌ అవసరం లేదు. పెంచాలనే ఇంట్రెస్ట్‌ ఉంటే చాలు అని నిరూపించారు సిద్దిపేట జిల్లా నారాయణరావు పేట మండలం మాల్యాల గ్రామ సర్పంచ్ దరిపల్లి వజ్రవ్వ. ప్లాస్టి క్ బాటిళ్లను కట్ చేసి అందులో మట్టిపోసి ఇంటి ముందే 50 రకాల పూల మొక్కలను పెంచుతోంది. ఏ సర్పంచి.. ముఖ్యంగా మహిళా సర్పంచులు చేయని విధంగా ఇంటి ముంగిట అనేక రకాల మొక్కలు పెంచిన వజ్రవ్వ అందరికీ ఆదర్శంగ నిలుస్తోంది. ఆ మొక్కలను చూసిన ప్రతి ఒక్కరూ బాగా మెచ్చుకుంటున్నారు. ఈమె ఇంటి తోట ఫోటోలు.. వీడియోలను నెటిజన్లు షేర్ చేస్తూ.. శభాష్ వజ్రవ్వ అని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

Latest Updates