లగడపాటి ఎగ్జిట్ పోల్స్ : ఏపీలో ఎవరికి ఎన్ని సీట్లిచ్చారంటే..?

lagadapati-rajagopal-survey-on-ap-elections-result

ఏపీ లో తెలుగుదేశానిదే మళ్లీ అధికారమని మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తన సర్వేలో తెలిపారు.  ఈ ఎన్నికల్లో  టీడీపీ 90 నుంచి 110, వైసీపీ 65 నుంచి 79, ఇతరులు 3 నుంచి 5 అసెంబ్లీ స్థానాలు గెలుచుకుంటాయని ఆయన తన సర్వేలో తెలిపారు.

ఇక ఎంపీ స్ధానాల విషయానికి వస్తే.. టీడీపీ 13 నుంచి 17, వైసీపీ 8 నుంచి 12, ఇతరులు ఒక స్ధానం రావొచ్చని ఆయన అన్నారు. అసెంబ్లీలో వివిధ పార్టీల ఓటింగ్ శాతం.. టీడీపీ 43 నుంచి 45 శాతం, వైసీపీ 40 నుంచి 42 శాతం, జనసేన 10 నుంచి 12 శాతంగా ఉంటుందని అన్నారు. పార్లమెంట్ లో టీడీపీ 43 నుంచి 45, వైసీపీ 40.5 నుంచి 42.5, జనసేన 10 నుంచి 12 శాతం ఓటింగ్ శాతం ఉంటుందని సర్వేలో తేలిందని లగడపాటి తెలిపారు.

Latest Updates