సర్కార్ ఆఫీసుల్లో లక్షన్నర పోస్టులు ఖాళీ

  • 4.57 లక్షల క్యాడర్​ స్ట్రెంత్​కు.. పనిచేస్తున్నది 3.09 లక్షల మందే
  • ప్రతి మూడు పోస్టులకు ఒక పోస్టు వేకెన్సీ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని అన్ని గవర్నమెంట్ ఆఫీసులు పోస్టుల ఖాళీలతో సతమతమవుతున్నాయి. ఒక్కో డిపార్ట్​మెంట్​లో ముగ్గురు చేయాల్సిన పనిని ఇద్దరితోనే ప్రభుత్వం చేయిస్తున్నది. ఏండ్ల తరబడి ఖాళీ పోస్టులను భర్తీ చేయకపోవడంతో మిగతా ఉద్యోగులు పని ఒత్తిడికి గురవుతున్నారు. ఎంతో ఆర్భాటంగా కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలు ఏర్పాటు చేసిన సర్కార్​.. కొత్త పోస్టులను మాత్రం మంజూరు చేయడం లేదు.  రాష్ట్రంలోని 32 ప్రభుత్వ శాఖల్లో 4.57 లక్షల క్యాడర్​ స్ట్రెంత్​ అవసరం కాగా.. ప్రస్తుతం 3.09 లక్షల మందే ఉన్నారు. మరో 1.48  లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు లెక్కలు చెప్తున్నాయి. నెలనెలా 400 నుంచి 500 మంది ఉద్యోగులు రిటైర్​ అవుతుండడంతో ఖాళీల సంఖ్య పెరుగుతూ పోతోంది. ప్రభుత్వ శాఖలు, విద్యాసంస్థల్లో ఆఫీసర్లు, లెక్చరర్లు, టీచర్లు, ఇతర స్టాఫ్​ కొరతతో అడ్మినిస్ట్రేషన్​, టీచింగ్​ గాడితప్పుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ఎడ్యుకేషన్​లోనే ఎక్కువ

రాష్ట్రంలో ఎడ్యుకేషన్​ డిపార్ట్​మెంట్​లోనే ఎక్కువగా 37,559 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.స్కూల్ ఎడ్యుకేషన్ లో 24,702 టీచింగ్, నాన్​ టీచింగ్ పోస్టులు.. హయ్యర్​ ఎడ్యుకేషన్​లో 12,857 టీచింగ్, నాన్​ టీచింగ్​ పోస్టులు భర్తీకి నోచుకోవడం లేదు. తెలంగాణ ఏర్పాటు తర్వాత ఒకసారి మాత్రమే టీచర్​ పోస్టులను ప్రభుత్వం భర్తీ  చేసింది. రాష్ట్ర ఏర్పాటు తర్వాత ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కాలేజీలు, యూనివర్సిటీల్లో ఒక్క పోస్టును కూడా భర్తీ చేయలేదు. రాష్ట్రంలోని 12 యూనివర్సిటీల్లో సుమారు 1,500 పోస్టులకుపైగా రిక్రూట్​ చేయాల్సి ఉంది. ఈ పోస్టులను భర్తీ చేయకుంటే నిధులు నిలిపివేస్తామని యూజీసీ హెచ్చరించడంతో కొంత కసరత్తు చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. ఆ తర్వాత యూనివర్సిటీలను గాలికొదిలేసింది. యూనివర్సిటీలకు వీసీల నియామకమే లేకపోవడంతో ఇప్పట్లో ఈ పోస్టులు భర్తీ చేసే అవకాశాలు కనిపించడం లేదు. దీంతో యూనివర్సిటీల్లో కాంట్రాక్ట్​, పార్ట్​టైం, అకడమిక్​ కన్సల్టెంట్లతో నెట్టుకొస్తున్నారు. ఈ స్థాయిలో ఖాళీలను పెట్టుకుని న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ​లక్ష్యాలను రాష్ట్ర ప్రభుత్వం ఏ మేరకు సాధిస్తుందనే సందేహాలు విద్యావేత్తల్లో తలెత్తుతున్నాయి.

మ్యాన్​ పవర్​ లేక పోలీసులకు కష్టాలు

పోలీస్​ శాఖలోని సివిల్, రిజర్వ్​, జైళ్లు, ఫైర్​ సర్వీస్​తో కలిపి 37,218  పోస్టులు ఖాళీగా ఉన్నాయి. లక్ష జనాభాకు 123 మంది పోలీసులే ఉన్నారు. మ్యాన్​ పవర్​ కొరతతో కానిస్టేబుళ్లతో పాటు ఆఫీసర్లూ వీక్లీ ఆఫ్​ తీసుకోలేని పరిస్థితి. దేశంలో పోలీసులు సగటున 14 గంటలు పనిచేస్తుంటే.. రాష్ట్రంలో సగటున 16 గంటలు డ్యూటీలోనే ఉంటున్నారని గతేడాది కామన్‌‌‌‌కాజ్‌‌‌‌, లోక్‌‌‌‌నీతి సీఎస్‌‌‌‌డీఎస్  నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. రోజూ 17 నుంచి 18 గంటలకంటే ఎక్కువ టైం డ్యూటీలోనే ఉండటం వల్ల సిబ్బంది తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ ఈ ఏడాది మార్చిలో అసెంబ్లీకి సమర్పించిన రిపోర్టులో పేర్కొన్నారు.  ప్రభుత్వం 17,156 పోలీస్​ ఉద్యోగాల భర్తీ కోసం 2019లో ఎగ్జామ్స్​ నిర్వహించి, రిజల్ట్స్​ ఇచ్చింది. సివిల్‌‌, ఏఆర్‌‌, ఎస్‌‌పీఎఫ్‌‌, జైలు వార్డెన్‌‌, సివిల్‌‌ ఎస్సైకి ఎంపికైన వాళ్లకు ఈ ఏడాది జనవరి 16న ట్రైనింగ్​ ప్రారంభించినా టీఎస్​ఎస్పీ కి ఎంపికైన 4,203 మందికి ట్రైనింగ్​ ప్రారంభించలేదు.

మెడికల్​, హెల్త్​, ఫ్యామిలీ వెల్ఫేర్​లో 23,512 ఖాళీలు

రాష్ట్రంలో ప్రస్తుతం పీహెచ్​సీల నుంచి టీచింగ్ హాస్పిటళ్ల దాకా డాక్టర్‌‌ ‌‌‌‌‌‌పోస్టులు 7,029 ఉంటే.. అందులో 2,200కుపైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కీలకమైన టీచింగ్ హాస్పిటళ్లలోనే వందల సంఖ్యలో ఖాళీలున్నాయి.  వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో 1,476  పోస్టులకు 826  మంది డాక్టర్లే ఉన్నారు. మిగతా 644 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆదిలాబాద్‌‌  ‌‌‌‌‌‌రిమ్స్‌‌ ‌‌‌‌లో 209 పోస్టులకు 116 మందే ఉన్నారు. ఇక, నిజామాబాద్‌‌‌‌ ‌‌‌‌హాస్పిటల్‌‌‌‌‌‌‌‌లో 311 పోస్టులకు కేవలం104 మంది రెగ్యులర్ డాక్టర్లు ఉన్నారు. మరో 83 మందిని కాంట్రాక్ట్  బేస్​పైనే  తీసుకున్నారు.  సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్​లో సుమారు 800 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు, 300కుపైగా అసోసియేట్ ప్రొఫెసర్‌‌‌‌‌‌‌‌, ప్రొఫెసర్  పోస్టులు ఖాళీగా ఉన్నాయి.  ఇక నర్సులు, ఇతర పారామెడికల్ సిబ్బంది పరిస్థితీ ఇట్లనే ఉంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని సర్కార్​ దవాఖాన్లలో 30 వేల వరకు బెడ్స్ ఉన్నాయి. రూల్స్​ ప్రకారం మూడు షిఫ్టులు కలిపి 18 వేల నుంచి 20 వేల మంది నర్సులు ఉండాలి. కానీ కేవలం 4,473 మంది రెగ్యులర్ నర్సులు పనిచేస్తున్నారు. మెడికల్​, హెల్త్​, ఫ్యామిలీ వెల్ఫేర్​ శాఖలో మొత్తం 48,889 శాంక్షన్డ్ పోస్టులు ఉంటే.. 25,377 మంది మాత్రమే పనిచేస్తున్నారు.

డిపార్ట్​మెంట్ల వారీగా హెచ్​వోడీ ఆఫీసులు, జిల్లాల్లో పోస్టుల ఖాళీలు ఇలా..

డిపార్ట్మెంట్                     శాంక్షన్డ్ పోస్టులు    ప్రస్తుత స్ట్రెంత్         ఖాళీలు

అగ్రికల్చర్                             7,085              5,345                1,740

పశుసంవర్ధక                         6,323             4,236                 2,087

బీసీ వెల్ఫేర్                           2,616             1,589                 1,027

ఫారెస్ట్                                   6,803             3,436                3,367

హయ్యర్ ఎడ్యుకేషన్               19,808            6,951               12,857

స్కూల్ ఎడ్యుకేషన్                 1,37,453       1,12,751            24,702

ఫైనాన్స్                                 3,991            2,616                1,375

హెల్త్, మెడికల్, ఫ్యామిలీ           48,889          25,377              23,512

హోం                                      96,643          59,425              37,218

ఇరిగేషన్                                10,566            7,771              2,795

లేబర్, ఎంప్లాయ్మెంట్              6,005            3,112               2,893

న్యాయ విభాగం                        2,361               507               1,854

మున్సిపల్                             8,302            6,769                1,533

పంచాయతీరాజ్                       28,351          22,422             5,929

రెవెన్యూ                                 27,860          19,742              8,118

సోషల్ వెల్ఫేర్                         13,068            7,534              5,534

ట్రైబల్ వెల్ఫేర్                          13,173            7,321              5,852

మహిళా సంక్షేమం                    4,112            2,300                1,812

మిగతా ఇతర శాఖల్లో               14,389            9,928               4,461

Latest Updates