MIM అనే పామును కేసీఆర్ పెంచి పోషిస్తున్నారు: లక్ష్మణ్

పౌరసత్వ సవరణ చట్టాన్ని(CAA) రద్దు చేయాలని కోరుతూ తెలంగాణ కేబినెట్ తీర్మానం చేయడం దారుణంగా ఉందన్నారు  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్. మెజారిటీ పక్షాల మద్దతుతో పార్లమెంటులో తీసుకొచ్చిన ఓ చట్టాన్ని రాష్ట్రం ఏ విధంగా వ్యతిరేకిస్తుందని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్, కేటీఆర్‌కు రాజ్యాంగం తెలియదా? లేకుంటే  ఒవైసీ మెప్పు కోసమా? అని ప్రశ్నించారు.

మత వివక్షకు గురైన వారి కోసమే పౌరసత్వ సవరణ బిల్లు తీసుకొచ్చామని, శరణార్థులకు భద్రత కల్పించడమే ఈ చట్టం ముఖ్య ఉద్దేశమని లక్ష్మణ్‌ వివరించారు. అంత ప్రేమ ఉంటే పాకిస్తాన్, బంగ్లాదేశ్ ముస్లింలకు పౌరసత్వం ఇవ్వాలని అసెంబ్లీలో తీర్మానం చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి సూచించారు.NPRను రాష్ట్రంలో అమలు చేస్తారో లేదో చెప్పాలన్నారు. MIM అనే పామును కేసీఆర్ పెంచి పోషిస్తున్నారని.. కానీ అదే తిరిగి కాటు వేసే ప్రమాదముంది జాగ్రత్త అని హెచ్చరించారు.

మరోవైపు కాంగ్రెస్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు లక్ష్మణ్. చట్ట సభల్లో బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలని ఉత్తమ్ మాట్లాడితే నవ్వుకుంటున్నారన్నారు. కాంగ్రెస్ 60 ఏళ్లు అధికారం లో వున్నప్పుడు ఏం చేసిందని ప్రశ్నించారు. బీజేపీ దళిత వ్యతిరేక పార్టీ అని విష ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ దుకాణం బందయ్యే పార్టీ అని, ఆ పార్టీ నాయకులు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలన్నారు లక్ష్మణ్‌.

Latest Updates