బంగారు తెలంగాణ కాదు బకాయిల తెలంగాణ

కేసీఆర్ రాష్ట్రాన్ని బకాయిల తెలంగాణగా  మార్చారన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ . సీఎంపై రాష్ట్ర  ప్రజలు ఆగ్రహంగా ఉన్నారన్నారు. కేసీఆర్ ఏడాది పాలనలో గొప్పగా చేసిందేమీ లేదన్నారు. నిరుద్యోగులను సీఎం మోసం చేశారన్నారు లక్ష్మణ్. లక్ష ఉద్యోగాలు ఇస్తామని చెప్పి 30 వేల ఉద్యోగాలే భర్తీ చేశారని విమర్శించారు. 3 లక్షల ఉద్యోగాలు ఖాలీగా ఉన్నాయన్నారు. రైతు బంధు అందరికీ అందడం లేదన్నారు. రైతు రుణమాఫీ  ఊసేలేదన్నారు లక్ష్మణ్. అన్ని వర్గాల ప్రజలు ముఖ్యమంత్రిపై ఆగ్రహంతో ఉన్నారన్నారు.ఆర్థిక శాఖ మంత్రి సమీక్షలో లేకుండానే సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారని అన్నారు.

Latest Updates