సినిమాల్లోకి లక్ష్మీ పార్వతి

వైసీపీ నేత, ఏపీ తెలుగు అకాడమీ ఛైర్మన్ లక్ష్మీపార్వతి సినీరంగ ప్రవేశం చేయనున్నారు. ఉమెన్ ఓరియెంటెడ్ సినిమాలో ఆమె కీలక పాత్ర పోషించనున్నారు. ఈ విషయాన్నిఆమె స్వయంగా తెలిపారు. దర్శకుడిగా మారిన.. సినీనటుడు శ్రీనివాసరెడ్డి ‘రాగల 24 గంటల్లో’ అనే చిత్రానికి దర్శకత్వం వహించారు. తర్వాత తీయబోయే సినిమా ‘రాధాకృష్ణ’ అనే పేరుతో తెరకెక్కుతోంది. తెలంగాణ నేపథ్యంలో ఈ మూవీని నిర్మించనున్నారు. ఈ సినిమాలో లక్ష్మీపార్వతి కీలక పాత్రలో నటించనున్నారట.

నాటకరంగంలో లక్ష్మీపార్వతికి ప్రవేశం ఉంది. ఇప్పుడు ఆమె సినిమాల్లోకి కూడా వస్తున్నారు.

Latest Updates