లక్ష్మీ’s NTR ట్రెండింగ్ : అరగంటలో 1 మిలియన్ వ్యూస్ క్రాస్

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందిస్తున్న తాజా సినిమా లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్ ఈ ఉదయం 9.27 నిమిషాలకు విడుదలైంది. కొద్దిరోజులుగా ఈ సినిమాపై వర్మ చేస్తున్న ప్రమోషన్ తో… ఇండస్ట్రీలోనే కాదు.. రాజకీయవర్గాల్లోనూ ఈ సినిమాపై బీభత్సమైన ఆసక్తి క్రియేట్ అయింది. ఆ క్యూరియాసిటీ అంతా… లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్ విడుదలైన కొద్దిసేపటికే రిఫ్లెక్ట్ అయింది. ఈ ట్రైలర్ కు విడుదలైన అరగంటలోనే 1 మిలియన్ వ్యూస్ వచ్చాయి.

వర్మ టేకింగ్… ఎన్టీఆర్ పాత్రతో పలికించిన సంభాషణలు… లక్ష్మీపార్వతి, చంద్రబాబు, హరికృష్ణ సహా..  ఇతర పాత్రధారులతో చెప్పించిన డైలాగులు… రామ రామ అనే బ్యాక్ గ్రౌండ్ సాంగ్.. కల్యాణ మాలిక్ ఇచ్చిన రీరికార్డింగ్, కెమెరా వర్క్… ట్రైలర్ రేంజ్ ను అమాంతం పెంచేశాయి.

పైనున్న ఎన్టీఆర్ ఆశీస్సులు మాకే ఉన్నాయంటూ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు. ఈ సిినిమాను ఓ కుటుంబ కుట్రల చిత్రంగా… నిజాలతో అల్లుకున్న కథగా… ఎన్టీఆర్ జీవితంలోని ప్రేమకథగా చూపిస్తున్నామన్నారు. ఈ సిినిమాకు రామ్ గోపాల్ వర్మతో పాటు అగస్త్య మంజు దర్శకత్వం వహిస్తున్నారు.

Latest Updates