లక్ష్మీస్ NTR: నడిరోడ్డుపై వర్మ ప్రెస్ మీట్

ఆంధ్ర ప్రదేశ్ లో ‘లక్ష్మీస్ NTR’ సినిమా  మే 1న రిలీజ్ అవనుందని తెలిపారు దర్శకులు రామ్ గోపాల్ వర్మ. చిత్ర ప్రమోషన్ లో భాగంగా విజయవాడ లోని నోవాటెల్ లో ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించేందుకు రెడీ అయ్యామని తెలిపారు. అయితే కొందరి బెదిరింపుల వల్ల హోటల్ ప్రతినిధులు తన ప్రోగ్రామ్ ను కాన్సిల్ చేశారని వర్మ తెలిపారు. “మనందరికి తెలిసిన ఒకతను నోవాటెల్ హోటల్ వాళ్లను బెదిరించి ‘లక్ష్మీస్ NTR’ సినిమా ప్రెస్ మీట్ ను హోటల్ లో పెట్టకుండా అడ్డుకున్నారు” అని వర్మ ట్వీట్ చేశారు. విజయవాడలో ఉన్న అన్ని హోటళ్లు, హాల్ లు తమ సినిమా ప్రెస్ మీట్ పెట్టేందుకు ఒప్పుకోలేవని చెప్పారు.

ప్రెస్ మీట్ ఆగదు.. రోడ్డుపైనే మాట్లాడతా: వర్మ
‘లక్ష్మీస్ NTR’ సినిమా ప్రెస్ మీట్ ఆగదని తెలిపారు వర్మ. అయితే విజయవాడలోని పైపుల రోడ్డు NTR సర్కిల్ వద్ద ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. తనను, NTR ను అభిమానించేవాళ్లు ప్రెస్ మీట్ కు హాజరుకావాలని కోరారు.

Latest Updates