లోకేశ్ మీద ఒట్టేసి చెబుతున్నా…! లక్ష్మీస్ NTR ట్రైలర్ -2 విడుదల

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన అప్ కమింగ్ సినిమా లక్ష్మీస్ ఎన్టీఆర్ కు సంబంధించిన రెండో ట్రైలర్ ను విడుదల చేశారు. మొదటి ట్రైలర్ తో తెలుగు రాష్ట్రాల్లోనే సినీ,రాజకీయ సంచలనం రేపిన ఆర్జీవీ.. రెండో ట్రైలర్ తో మరో సెన్సేషన్ ను క్రియేట్ చేశారు.  “వాడూ నా పిల్లలు కలిసి నన్ను చంపేశారు” అంటూ ఎన్టీఆర్ చెప్పినట్టుగా ట్రైలర్ లో ఓ స్లైడ్ వేశారు. “నా కొడుకు లోకేశ్ పైన ఒట్టేసి చెబుతున్నా…” అని చంద్రబాబు పాత్ర చెప్పే డైలాగ్ ఆసక్తి కలిగిస్తోంది. దానిని ఆపాలని నేను చేసే ప్రయత్నాలకు హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ కావాలి అంటూ చంద్రబాబు పాత్ర చెబుతుంది. “అబద్దాలకు నోరు పెద్దది.. అన్యాయానికి చేతులు పెద్దవి”, “వెన్నుపోటు పొడిచారు.. నమ్మించి వంచించి.. వెన్నుపోటు పొడిచారు.. కుట్ర.. కుట్ర”  అనే బ్యాక్ గ్రౌండ్ సాంగ్ వినిపించారు. టైమ్ రాదు..  అది మనమే తీసుకురావాలి అని చంద్రబాబు క్యారెక్టర్ చెప్పే డైలాగ్ కూడా ఎట్రాక్ట్ చేస్తుంది. చంద్రబాబు ప్రమాణ స్వీకారం సన్నివేశాలను ఈ ట్రైలర్ లో చూపించారు వర్మ.

స్త్రీలందరికీ తమ తోటి స్త్రీకి జరిగిన అతి ఘోరమైన హృదయ విధారకమయిన అన్యాయాన్ని చూపించడమే lakshmi’s NTR ఉద్దేశం అని వర్మ ట్విట్టర్ లో చెప్పారు. ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కానుంది.