తెలంగాణలో నేడు‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ విడుదల

రామ్ గోపాల్ వర్మ డైరెక్ట్ చేసిన‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా విడుదలపై ఏపీ హైకోర్టుస్టే విధించింది. ఏప్రిల్‌ 3 వరకు ఈ సినిమాను ప్రదర్శించొద్దని ఆదేశించింది. సినిమా కాపీని తమ చాంబర్ కు తీసుకొస్తే లాయర్ల సమక్షంలో సినిమా చూస్తామని జడ్జి చెప్పారు. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా విడుదలను ఆపాలని ఇద్దరు వ్యక్తులు వేసిన రిట్‌ పిటిషన్లపై హైకోర్టులో గురువారం వాదనలు జరిగాయి. రెండు పార్టీల వాదనలు విన్న తర్వాత ఈ కేసు విచారణను హైకోర్టు ఏప్రిల్‌ 3కు వాయిదావేసింది. మరోవైపు ఇదే సినిమాపై మంగళగిరి కోర్టుకూడా స్టే ఇచ్చింది. ఏప్రిల్‌ 15 వరకూ మంగళగిరిలో సినిమాను విడుదల చేయొద్దని ఇంజక్షన్‌ ఆర్డర్‌ జారీ చేసింది. శుక్రవారం తెలంగాణలో యథావిధిగా లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా రిలీజ్ కానుంది. ఏపీ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్తామని లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా నిర్మాత చెప్పారు.

Latest Updates