వర్మ ట్వీట్ : ఏపీలో లక్ష్మీస్ వచ్చేస్తుంది..!

ఎన్టీఆర్ జీవితం ఆధారంగా రాంగోపాల్ వర్మ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా లక్ష్మీస్ ఎన్టీఆర్. ఈ మూవీ ఇటీవల రిలీజై సంచలనాలు సృష్టించగా..ఏపీలో మాత్రం ఎన్నికల సందర్భంగా విడుదలను అడ్డుకున్నారు. ఎలక్షన్ అయిపోయాయి. ఏపీలో విడుదలకు లక్ష్మీస్ రెడీ అయ్యింది. కార్మికుల దినోత్సవం (మే-1) రోజున ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్లు తెలిపాడు వర్మ. తెరవెనుక ఎన్టీఆర్ జీవితంలో ఏం జరిగిందో తెలుసుకోవడానికి సినిమాను చూడండి అంటూ ట్వీట్ చేశాడు. తెలంగాణలో మంచి టాక్ తెచ్చుకున్న ఈ సినిమాను ఆంధ్ర ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.

 

Latest Updates