’లాంతరు’ లాలూ ప్రసాద్ బయోపిక్

సినిమా ఇండస్ట్రీలో కొంత కాలంగా ప్రముఖులు…స్పోర్ట్స్ స్టార్ల బయోపిక్ ల హవా నడుస్తోంది. నిర్మాతలు, దర్శకులు కూడా వాటిని నిర్మించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం బీహార్ మాజీ సీఎం, రాష్ట్రీయ జ‌న‌తా ద‌ళ్ అధినేత లాలూ ప్ర‌సాద్ జీవితంపై సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారు చిత్ర ద‌ర్శ‌క.. నిర్మాత‌లు. లాలూ పార్టీ ఆర్జేడీ గుర్తు లాంత‌రు కావ‌డంతో ఆయ‌న సినిమాకి లాంత‌రు అనే పేరు పెట్టిన‌ట్టు సమాచారం. ప్ర‌ముఖ భోజ్‌పురి న‌టుడు య‌శ్ కుమార్ ..లాలూ పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు. లాలూ స‌తీమ‌ణి ర‌బ్రీదేవి పాత్ర‌లో స్మృతి సిన్హా న‌టించ‌నున్నారు. వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రిలో ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు.

 

Latest Updates