పోలీసుల కస్టడీకి లోన్ యాప్స్ నిందితుడు లాంబో

ఆన్‌లైన్ మనీ యాప్స్ కేసు దర్యాప్తును సైబర్ క్రైమ్ పోలీసులు ముమ్మరం చేశారు. ఇన్‌స్టెంట్‌లోన్ యాప్స్ కేసుకు సంబంధించి సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. చైనాకు చెందిన జెన్నిఫర్, ఏంజలీనా అనే ఇద్దరు మహిళలు కీలకంగా వ్యవహరించినట్లు పోలీసులు గుర్తించారు. వీరిద్దరూ ఇండోనేషియాలో ఉంటూ గుర్గావ్ కేంద్రంగా ఆన్‌లైన్ యాప్ప్ నిర్వహిస్తున్నారని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం వీరిద్దరు విదేశాల్లో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఆన్‌లైన్ మనీ యాప్స్ కేసులో కీలక నిందితులైన లాంబో, నాగరాజులను నాలుగు రోజులపాటు కస్టడీకి ఇస్తూ కోర్టు అనుమతించింది. దాంతో లాంబో, నాగరాజులను ఈరోజు సైబర్ క్రైమ్ పోలీసులు కస్టడీకి తీసుకొని.. సైబర్ క్రైమ్ కార్యాలయంలో విచారించనున్నారు.

For More News..

దాడికి కారణమైన ట్రంప్ ట్వీట్లు.. అకౌంట్లు బ్లాక్ చేసిన సోషల్ మీడియా సంస్థలు

అఖిలప్రియ బెయిల్ పిటిషన్‌పై వాదనలు

పరిహారం కోసం నాలుగేండ్లుగా ఆఫీసుల చుట్టూ..

Latest Updates