లాంబోర్గీనీ లగ్జరీ బోట్.. రూ.25 కోట్లు

లగ్జరీ కార్లను తయారు చేసే లాంబోర్గీనీ యాట్‌ బిజినెస్‌ లోకి ప్రవేశించింది. ఈ ఇటాలియన్ కారు కంపెనీ తన లగ్జరీ యాట్‌ను లాంఛ్ చేసింది. లగ్జరీ స్పీడ్‌ యాట్‌ రూపంలో దీన్ని డిజైన్ చేసినట్టు లాంబోర్గీనీ తెలిపింది. దీన్ని ‘టెక్నోమార్ ఫర్ లాంబోర్గీనీ 63’ పేరుతో విడుదల చేసింది. లాంబోర్గీనీ కంపెనీ 1963లో ఏర్పాటైంది కాబట్టి.. దీని పేరులో కూడా 63 ను కంపెనీ యాడ్ చేసింది. బోట్‌ బిల్డర్ ఇటాలియన్ సీ గ్రూప్ తో భాగస్వామ్యమై, ఈ కొత్త మిషన్‌‌ను అభివృద్ధి చేసింది. ఈ యాట్‌ ధర 3.4 మిలియన్ డాలర్లు అంటే రూ.25 కోట్లు . ఈ యాట్‌ టాప్ స్పీడ్ గంటకు 69 మైల్స్.

Latest Updates