ఎమ్మెల్యే కొడుకుపై కబ్జా ఆరోపణలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గంలో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర రావు తనయుడు రాఘవ తన అనుచరులతో.. స్థలం కబ్జా చేయించారని ఆరోపిస్తున్నారు బాధితులు. పాల్వంచ మున్సిపాలిటీలోని ఒడ్డుగూడెం ప్రాంతంలో షేక్ జైనబ్ బీకి.. సర్వే నంబర్ 685లో 503 గజాల స్థలం ఉంది. 1981లోనే తమ పేరున ఈ స్థలం రిజిష్ట్రేషన్ అయిందంటున్నారు బాధితులు. అయితే ఆ స్థలం తమదేనని కొందరు నిర్మాణాలు చేపట్టారు. ఆ నిర్మాణాలను జైనబ్ బీ కుటుంబీకులు కూల్చివేశారు. కోర్ట్ లో కేసు ఉండగా ఎలా నిర్మాణాలు చేపడతారని ప్రశ్నిస్తున్నారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు బాధితులు.

 

Latest Updates