ఫ్లాట్ కబ్జా: ప్రశ్నించినందుకు ఎస్సీ, ఎస్టీ కేసు పెడతానన్నడు..

land-grabbing-from-80-years-old-woman-in-alwal-macha-bollaram-secunderabad

బంగారు తెలంగాణలో భూకబ్జాదారులు లేకుండా చేయాలని పోలీసులను కోరింది ఓ వృద్ధురాలు. సికింద్రాబాద్ అల్వాల్ లోని మచ్చ బొల్లారంలో నివాసం ఉంటున్న ఎస్.వెంకట లక్ష్మి అనే వృద్ధురాలికి స్థానికంగా 244గజాల ఫ్లాట్ ఉంది. అయితే కొన్ని కుటుంబ కారణాల రీత్య సదరు ఫ్లాట్ అమ్మకానికి పెట్టింది. దీంతో స్థానికంగా ఉన్న ఎస్.బి. ప్రవీణ్ అనే అతను తమ ఫ్లాట్ ను ఆక్రమించేందుకు చూస్తున్నాడని చెప్పింది. దీంతో పాటు… అడిగినంత రేటుకే ఫ్లాట్ ను తనకే అమ్మాలని ప్రవీణ్ బెధిరిస్తున్నట్లు చెప్పింది వెంకట లక్ష్మి.

20ఏండ్ల క్రితం 244గజాల స్థలాన్ని ఎంతో కష్టపడి మచ్చ బొల్లారంలో కొన్నట్లుగా తెలిపింది వెంకటలక్ష్మి.  అయితే కొన్ని కుటుంబ అవసరాలకోసం ఆ ఫ్లాట్ ను అమ్మేందుకు గొడపై సేల్ అంటూ తమ ఫోన్ నెంబర్ రాశామని చెప్పింది. అయితే ప్రవీణ్ తమ పేరును, ఫోన్ నెంబర్ ను తుడిచి అతని పేరును ఫోన్ నెంబర్ ను రాశాడని తెలిపింది. ఈ విషయంపై ప్రవీన్ ను ప్రశ్నించగా.. ఎస్సీ, ఎస్టీ కేసులు పెడతానంటూ బెదిరిస్తున్నాడని వెంకటలక్ష్మి మీడియాకు తెలిపింది. ప్రవీణ్ పై పోలీసులకు ఫిర్యారు చేసినట్లు చెప్పింది.

Latest Updates