ఆస్తి తగాదా కాల్పుల్లో 10 మంది మృతి

ఆస్తికోసం జరిగిన తగాదాలో ఒకరిని మరొకరు కాల్చుకొని 10 మంది మృతి చెందారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ జరిగింది. సోంభద్ర సమీపంలోని ఓ ఐఏఎస్ అధికారికి చెందిన 22 ఎకరాలను రెండు సంవత్సరాల క్రితం యాగ్య దత్ అనే వ్యక్తికి అమ్మారు. అయితే దత్ భూమిని స్వాధీనం చేసుకునేందుకు కొంత మంది ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే గొడవలు చెలరేగాయి. వీరి మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇరు గ్రూపులు తుపాలకులతో ఒకరినొకరు కాల్చుకున్నారు.

ఈ కాల్పుల్లో 10 మంది చనిపోగా ..19 మంది గాయపడ్డారని తెలిపారు రాష్ట్ర డీజీపీ ఓపీ సింగ్. ఘోరవాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మారుమూల ప్రదేశంలో ఈ ఘర్షణ జరిగిందని ఇన్స్పెక్టర్ జనరల్ ప్రవీణ్ కుమార్ తెలిపారు.

 

Latest Updates