శంషాబాద్ లో భూ మాఫియా.. నడిరాత్రి ఫెన్సింగ్ లు

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లో ల్యాండ్ మాఫియా రెచ్చిపోతుంది. శుక్రవారం రాత్రి శంషాబాద్ ఊటుపల్ల వద్ద హైదరాబాద్ కు చెందిన ఓ మూఠా రెండెకరాల భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నించింది. స్థానికుడైన ఆ భూమి యజమాని స్థానికుల సహాయంతో ఆ ముఠాను అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఇరు వర్గాలను పోలీస్ స్టేషన్ కు తరలించారు.

శంషాబాద్ మండలం లోని ఊటుపల్లి వద్ద సర్వే నంబర్లు 26-28 లలో గల రెండు ఎకరాల భూమి తమ సొంతమని స్థానికులైన ప్రవీన్ గౌడ్ చెబుతున్నారు. నిన్న రాత్రి కొందరు వ్యక్తులు వచ్చి తమ భూమిలో ఫెన్సింగ్ వేయడానికి ప్రయత్నించడంతో స్థానికుల సహాయంతో అడ్డుకున్నట్లు ప్రవీన్ చెప్పారు. ఫెన్సింగ్ వేస్తున్న వారిని అడ్డుకోబోతుంటే.. మారణాయుధాలతో చంపడానికి ప్రయత్నించారని ప్రవీన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Latest Updates