కీసర మాజీ తహసిల్దార్ జారీ చేసిన పట్టాపుస్తకాలు రద్దు

మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా: కీసర మాజీ తహసీల్దార్‌ నాగరాజు జారీచేసిన పట్టా పాస్ పుస్తకాలను జిల్లా కలెక్టర్ రద్దు చేశారు. పట్టా పాస్‌ పుస్తకాలపై విచారణ జరపాలని అధికారులను ఆదేశించారు. ఈ కేసులో ఏసీబీ దర్యాప్తును ముమ్మరం చేసింది. ఇప్పటికే నిందితుల బెయిల్ పిటీషన్‌ను ఏసీబీ కోర్టు కొట్టివేసింది. దీంతో నిందితులను మరోసారి కస్టడీలోకి తీసుకోవాలని ఏసీబీ  భావిస్తోంది. ఈ కేసులో పై స్థాయి అధికారుల పాత్రపై ఏసీబీ ఆరా తీస్తోంది. త్వరలో పైస్థాయి అధికారులకు ఏసీబీ నోటీసులు ఇచ్చి విచారించే అవకాశం ఉంది. ఓ భూవివాద పరిష్కారానికి రూ. 2 కోట్ల లంచం డిమాండ్‌ చేసి.. రూ. 1.10 కోట్లు తీసుకుంటున్న కీసర తహసీల్దార్‌ నాగరాజును ఏసీబీ అధికారులు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్న విషయం తెలిసిందే.

 

Latest Updates