పార్టీల బ్యాంకు ఖాతాల్లో పైసలే పైసలు!

large amount money in political parties bank accounts
  • బ్యాంకు బ్యాలన్స్ లో బీఎస్పీ టాప్.
  • ఆ పార్టీ ఖాతాల్లో రూ.669 కోట్ల డిపాజిట్
  • తర్వాతి స్థా నాల్లో ఎస్పీ, కాం గ్రెస్ పార్టీలు
  • 107 కోట్ల బ్యాలెన్స్​తో నాలుగో ప్లేస్ లో టీడీపీ
  • ఐదో స్థా నంలో బీజేపీ.. భారీగా నిధులొస్తున్నా ఖర్చు పెట్టేయడమే కారణం

ఎలక్షన్లలో ఏ అభ్యర్థి ఆస్తులెన్ని , ఏ సెగ్మెంట్ లో బాగాడబ్బులున్నోళ్లు  పోటీ పడుతున్నారు అంటూ చర్చలు జరుగుతుండటం మామూలే. మరి ఏ రాజకీయ పార్టీ దగ్గర ఎన్ని డబ్బులున్నాయి, ఏ పార్టీకి ఎక్కువగా డబ్బులొస్తున్నాయో  తెలుసా? లోక్ సభ, పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యం లో.. వివిధ రాజకీయపార్టీలు ఎలక్షన్ కమిషన్ కు తమ దగ్గర ఉన్న సొమ్ములెక్కలు చెప్పాయి. దాన్ని బట్టి చూస్తే.. దేశంలో బాగా డబ్బులున్న రాజకీయ పార్టీగా బీఎస్పీ నిలిచింది. సమాజ్ వాదీ పార్టీ, కాం గ్రెస్ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఈ జాబితాలో బీజేపీని వెనక్కి నెట్టి మరీ తెలుగుదేశం పార్టీ నాలుగో స్థానంలో ఉంది. అయితే బ్యాంకుల్లో ఉన్న సొమ్ము సంగతేందోగానీ, విరాళాలతో భారీగా డబ్బులొస్తున్నది మాత్రం బీజేపీకే. ఆ తర్వాతి స్థానంలో కాం గ్రెస్ పార్టీ ఉంది.

అధికారిక లెక్కలే..

రాజకీయ పార్టీల సొమ్ము లెక్కలేంటో మనకు పెద్దగా తెలియదు. ఎప్పుడో ఒకసారి ఎలక్షన్ల సమయంలో తప్ప వివరాలు బయటికి తెలియవు. వాస్తవంగా చెప్పాలంటే.. ఇలా అధికారికంగా వెల్లడించే డబ్బు లెక్కలన్నీ చాలా తక్కువ. అసలు రాబడి, ఖర్చు అంతకు పదింతలకు పైనే ఉంటుంది కూడా. అయినా అధికారిక లెక్కలు చూసినా .. ఏ పార్టీ ‘డబ్బుల’లెక్క ఏంటో తెలిసిపోతుంది మరి. తాజాగా లోక్ సభ ఎలక్షన్ల నేపథ్యంలో దేశంలోని వివిధ రాజకీయ పార్టీలు తమబ్యాంకు బ్యాలెన్స్ వివరాలను కేంద్ర ఎన్నికల కమిషన్ కు సమర్పించాయి. ఈ ఏడాది మార్చి చివరి నాటికి డిపాజిట్లుగా ఉన్న సొమ్ము లెక్కలను వెల్లడించాయి. ఇందులో బహుజన్ సమాజ్ వాదీ పార్టీ (బీఎస్పీ) అన్నింటికన్నా టాప్ లో నిలిచింది.

టాప్ లో బీఎస్పీ

దేశంలోని ఏడు జాతీయ పార్టీల్లో ఒకటైన బీఎస్పీ దగ్గర రూ.669 కోట్ల బ్యాంకు బ్యాలెన్స్ ​ ఉంది.ఢిల్లీలోని  పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లోని 8 ఖాతాల్లో ఈ డిపాజిట్లు ఉన్నట్టు ఆ పార్టీ ఈసీకి ఇచ్చిన లెక్కల్లో వెల్లడించింది. దీంతో పాటు రూ.95.54 లక్షల నగదు వినియోగానికి సిద్ధంగా ఉన్నట్టు తెలిపింది. విశేషం ఏమిటంటే.. 2014 లోక్ సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా 400కు పైగా సీట్లలో పోటీ చేసిన బీఎస్పీ ఒక్కచోట కూడా గెలవలేదు. లోక్ సభలో ఒక్క ఎంపీ కూడా లేరు. అయితే పార్టీకి విరాళాలు వస్తున్నా వాటిని ప్రచారం,ఇతర కార్యక్రమాల కోసం ఖర్చుచేయకపోవడం వల్లేనగదు నిల్వలు భారీగా ఉన్నట్టు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. గతేడాది నవంబర్, డిసెంబర్ నెలల్లోఈ పార్టీకి రూ.24 కోట్లు విరాళాలు వచ్చాయి.

ఎస్పీ సెకండ్ ప్లేస్ ..

ఉత్తర ప్రదేశ్ లో ప్రధాన ప్రతిపక్షమైన సమాజ్ వాదీ బ్యాంక్ బ్యాలెన్స్​లో రెండో స్థానంలో నిలిచిం ది. ఈపార్టీకి రూ.471 కోట్ల బ్యాంకు డిపాజిట్లు ఉన్నాయి.నవంబర్ , డిసెంబర్ లలో ఈ పార్టీకి రూ.3 కోట్లు విరాళాలు వచ్చాయి. అయితే మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పలు చోట్ల పోటీ చేసిన సమాజ్ వాదీ ప్రచారం కోసం కొన్నినిధులు ఖర్చు చేసినట్టు తెలిపింది. దీంతో గతేడాది అక్టోబర్ లో రూ.482 కోట్లుగా ఉన్న డిపాజిట్లు,రూ.471 కోట్లకు తగ్గాయి.

లెక్కలు చూపని పార్టీలెన్నో..

కొన్ని రాజకీయ పార్టీలు ఎప్పటికప్పుడు తమకు వస్తున్న విరాళాలు, ఖర్చుల వివరాలను ఈసీకి సమర్పిస్తు న్నాయి. కానీ పెద్ద సంఖ్యలో పార్టీలు సరిగా లెక్కలు చెప్పడం లేదు. అందువల్ల ఈసీ వద్ద కూడా పూర్తి వివరాలు ఉండటం లేదు. ప్రధాన జాతీయపార్టీ అయిన కాం గ్రెస్ కూడా గతేడాది డిసెంబర్ తర్వాతి లెక్కలు ఇప్పటివరకు వెల్లడించలేదు. కొన్నిప్రాంతీయ పార్టీలైతే భారీగా విరాళాలు వస్తున్నా..వాటిని లెక్క చూపడం లేదనే ఆరోపణలున్నాయి. ఆయా పార్టీలు నామమాత్రంగా విరాళాలు వస్తున్నట్టు , పెద్దగా ఖర్చులేమీ పెట్టడం లేదన్నట్టుగా చూపుతున్నాయని ఎలక్షన్ నిపుణులు అంటున్నారు.

బీజేపీకి బోలెడు డబ్బులు..

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రూ. 83 కోట్ల డిపాజిట్లతో ఐదో స్థానంలో ఉంది. ఈ పార్టీకి గతేడాది అక్టోబర్ లో బ్యాంక్ బ్యాలెన్స్​ రూ. 66 కోట్లు-కాగా.. తర్వాత ఏకంగా రూ.342 కోట్లు విరాళాలు వచ్చాయి. కానీ బీజేపీ ఎలక్షన్ ప్రచారం, ఇతర పార్టీకార్యక్రమాల కోసం ఏకంగా రూ.325 కోట్లు ఖర్చు పెట్టినట్టు పేర్కొంది. దాంతో ఫిబ్రవరి చివరినాటికి రూ.83 కోట్లు మిగిలాయి. మొత్తంగా చూస్తే.. 2017–18ఆర్థిక సంవత్సరంలో బీజేపీకి రూ.1,027 కోట్లు విరాళాలు సమకూరగా.. రూ.758 కోట్లను డిసెంబర్ నాటికే ఖర్చు చేసింది. బీజేపీకి 2016–17 ఆర్థిక సంవత్సరంలోనూ భారీగా రూ.1,034 కోట్లు విరాళాలు రావడం గమనార్హం.

ఖర్చుపెట్టి వెనుకబడ్డా రు!

ప్రధాన పక్షాలైన కాంగ్రెస్, బీజేపీలకుభారీగా విరాళాలు వస్తు న్నా.. ఆ పార్టీలుఖర్చు పెడుతుండటంతో వాటి బ్యాంక్ బ్యాలెన్స్ లు తక్కువగా ఉంటున్నాయి.

  • మూడో స్థానంలో ఉన్న కాం గ్రెస్ వద్ద డిసెంబర్ చివరి నాటికి రూ.196 కోట్లు డిపాజిట్లు ఉన్నాయి. గతేడాది అక్టోబర్ లో ఈపార్టీ వద్ద రూ. 136 కోట్లు ఉండగా.. తర్వాత రూ. 77 కోట్లు వి రాళంగా వచ్చాయి.అసెం బ్లీ ఎలక్షన్లలో ఖర్చులుపోను ఈడబ్బులు మిగిలాయి. డిసెం బర్ తర్వాతివిరా ళాలు, డిపాజిట్ల వివరాలు ఇంకాఈసీకి ఇవ్వలేదు. ఈ పార్టీకి 2016–17లోమొత్తంగా రూ. 225 కోట్లు విరాళాలు వచ్చాయి. గత ఆర్థిక సంవత్సరం లెక్కలు పూర్తి కాలేదు.
  • నాలుగో ప్లేస్ లో ఉన్న టీడీపీ దగ్గర రూ. 107 కోట్ల డిపాజిట్లు ఉన్నాయి. గతేడాది అక్టోబర్లో రూ. 73 కోట్లే ఉండగా.. తర్వాత రూ. 36కోట్లు విరాళంగా వచ్చాయి. ఫిబ్రవరి చివరి-నాటికి రూ.2 కోట్లు ఖర్చు చూపారు.
  • సీపీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ వద్ద చెరో రూ. 3కోట్లు బ్యాలెన్స్​ ఉన్నట్టు లెక్కలు చూపాయి. గతేడాది చివరి మూడు నెలల్లో  సీపీఎంకు రూ.10 కోట్లు, ఆప్ కు రూ. 4 కోట్లు విరాళాలు వచ్చాయి. సీపీఎంకు కొన్నేళ్లుగా ఏటా రూ.100 కోట్లకుపైనే విరాళాలు వస్తున్నాయి.

Latest Updates