గాంధీ హాస్పిటల్​లో అతిపెద్ద ఎమర్జెన్సీ సెంటర్​

హైదరాబాద్, వెలుగు: సికింద్రాబాద్​లోని గాంధీ దవాఖానలో రాష్ట్రంలోనే అతిపెద్ద, అత్యాధునిక ఎమర్జెన్సీ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  సిద్ధమవుతోంది. రూ. 8 కోట్లతో 60 బెడ్ల కెపాసిటీతో దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ పనులు చివరి దశలో ఉన్నాయని, ఫిబ్రవరిలో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ ఆఫీసర్లు తెలిపారు. గుండెపోటు బాధితుల చికిత్స కోసం ఇక్కడే స్టెమీ హబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం నేషనల్ హెల్త్ మిషన్ కింద కేంద్ర ప్రభుత్వం 60 శాతం నిధులు మంజూరు చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఏటా సగటున 80 వేల మెడికల్ ఎమర్జెన్సీ కేసులు నమోదవుతున్నాయి. గతేడాది 108 (అంబులెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) వార్షిక నివేదిక ప్రకారం ఎమర్జెన్సీ కేసుల్లో 70 శాతం రోడ్డు ప్రమాద బాధితులవే.  రెండో స్థానంలో గుండెపోటు బాధితులు ఉండగా, ఆ తర్వాతి స్థానంలో యానిమల్ ఎటాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  కేసులున్నాయి. యాక్సిడెంట్ ఎమర్జెన్సీల్లో ఎక్కువ శాతం సీవియర్ కేసులు గాంధీ హాస్పిటల్​కే వస్తున్నాయి. ఇక గుండెపోటు బాధితుల విషయంలో ప్రైవేటు దవాఖానలే దిక్కవుతున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా దవాఖాన్లలో కార్డియాలజీ సెంటర్లు, గాంధీ హాస్పిటల్​లో స్టెమీ హబ్ పెట్టాలని నిర్ణయించారు. వీటిని కూడా ఫిబ్రవరిలో ప్రారంభించనున్నట్టు ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎం స్టేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్లు తెలిపారు.

ఎమర్జెన్సీ మెడిసిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  కొరత

ప్రస్తుతం గాంధీ హాస్పిటల్​లో అన్ని రకాల సూపర్ స్పెషాలిటీ సేవలు అందించే డాక్టర్లు అందుబాటులో ఉన్నారు. కానీ, ఎమర్జెన్సీలో ప్రాణాలు కాపాడే మెడిసిన్ మాత్రం బయట కొనుక్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఎమర్జెన్సీ మెడిసిన్ ధరలు ఎక్కువగా ఉండడం, ప్రభుత్వం మెడిసిన్స్​కు బడ్జెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తక్కువగా కేటాయిస్తుండడంతో ఈ పరిస్థితి తలెత్తుతోందని ఆఫీసర్లు చెబుతున్నారు. ప్రస్తుతం టీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐడీసీ ద్వారా 213 రకాల ఎమర్జెన్సీ మెడిసిన్ కొనుగోలు చేస్తుండగా, ఇటీవలే మరో వంద రకాల మందులను అదనంగా చేర్చారు. ఇవి అందుబాటులోకి వస్తే సమస్య కొంత తీరే అవకాశం ఉందంటున్నారు. ఇవిగాక, కొన్ని కేసుల్లోనే అవసరమయ్యే మందుల కొనుగోలుకు టీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐడీసీ బడ్జెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 20శాతం దవాఖాన్లకు కేటాయిస్తున్నారు. కానీ, గాంధీ, ఉస్మానియా వంటి పెద్ద దవాఖాన్లకు ఇది ఏమాత్రం సరిపోదని, మరింత పెంచాల్సిన అవసరముందని డాక్టర్లు అభిప్రాయపడుతున్నారు.