ఎబోలాకు రెండో వ్యాక్సిన్

  • లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్ ఆధ్వర్యంలో తయారీ
  • జంతువులపై ట్రయల్స్​.. ఆ తర్వాత 6 వేల మంది మామూలు మనుషులపైనా
  • మంచి ఫలితాలిచ్చిన మందు..రోగులకు ఇవ్వడం ప్రమాదమంటున్న నిపుణులు
  • మెర్క్​ తయారు చేసిన ఫస్ట్​ వ్యాక్సిన్ నే ఎక్కు వ తయారు చేయాలన్న డిమాండ్లు

ఎబోలా.. ఆఫ్రికా దేశాలను గడగడలాడిస్తున్నమహమ్మారి . దాని బారిన పడి ఒక్క డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాం గోలోనే 1500 మందికిపైగా చనిపోయారు. ఇప్పటి కీ కొన్ని వేల కేసులు నమోదవుతున్నా యి. దీంతో దానిని నిరోధించేందుకు వ్యాక్సిన్లు వేస్తున్నా రు. ఇప్పటి కే ఓ వ్యాక్సిన్ అక్కడ అందుబాటులో ఉంది. ఇప్పుడు మరో వ్యాక్సిన్ ను తీసుకురానున్నారు. కానీ, ఆ రెం డో వ్యాక్సిన్ పైనే ఇప్పుడు వివాదం రేగుతోంది. కనీసం దానిని టెస్టు చేయకుండా ఎలా ఇస్తారన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. కానీ, ఆ మందుపై పనిచేస్తున్న వాళ్లు మాత్రం దానిని టెస్ట్​ చేశామని, మంచి ఫలితాలు వచ్చాయి కాబట్టే జనాలకు ఇవ్వాలనుకుంటున్నామని చెబుతున్నా రు.

పరీక్షలు సక్సెస్ , కానీ…

రెండో వ్యాక్సిన్ ను జాన్సన్ అండ్ జాన్సన్ తయారు చేసింది. ఆ వ్యాక్సిన్ ను ఇప్పటికే 6 వేల మందికి ఇచ్చి పరీక్షించి చూశారు. ఆ పరీక్షల్లో అది మంచి ఫలితాలను చూపించిందని టెస్టుల్లో పాల్గొన్న లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రాపికల్ మెడిసి న్ డైరెక్టర్ , ఎబోలా నిపుణుడు ప్రొఫెసర్ పీటర్ పియట్ చెప్పారు. అయితే, వ్యాక్సిన్ ను మామూలు జనాలకే ఇచ్చి పరీక్షించారు. ఎబోలా రోగులపై ప్రయోగించలేదు. ఇప్పటికీ అది పరిశోధన దశలోనే ఉంది. ప్రస్తుతం మనిషి జన్యువులనుపోలి ఉండే జంతువులపై ట్రయల్స్ చేశారు. ఆ ట్రయల్స్ లో అది మంచి ఫలితాలనిచ్చింది. దీంతో మామూలు మనుషులకు ఆ వ్యాక్సిన్ ను ఇచ్చారు. ఇప్పటి కిప్పుడు దానిని ఎబోలా సోకిన వారిపై ట్రయల్స్ చేయడమంటే చాలా ప్రమాదమేనని నిపుణులు చెబుతూ వస్తున్నారు.

‘ఫస్ట్​ ‘వ్యాక్సిన్లు సరిపోతాయా?…

రెండో వ్యాక్సిన్ ను తీసుకొస్తున్నారు సరే. కానీ, మెర్క్​ తయారు చేసిన వ్యాక్సిన్ మంచి ఫలితాలనిచ్చి నప్పుడు, దానినే పెద్ద సంఖ్యలో ఎందుకు ఉత్పత్తి చేయకూడదన్న ప్రశ్నలు తలెత్తుతున్నా యి. మెర్క్​ వ్యాక్సిన్లు చాలినన్ని లేవని జులైలో డబ్ల్ యూహెచ్ వో ఎమర్జెన్సీ కమిటీ నిర్ధారిం చింది. ప్రస్తుతం కాంగోలో చెలరేగిన ఎబోలా కేసులకు ఆ వ్యాక్సిన్లు ఏ మూలకూ సరిపోవని వెల్ కమ్ ట్రస్ట్​ ప్రతినిధి డాక్టర్ జోసీ గోల్డింగ్ చెబుతున్నా రు. కాబ్టటి జాన్సన్ అండ్ జాన్సన్ తయారు చేసిన రెం డో వ్యాక్సిన్ ను తప్పనిసరిగా తీసుకురావాల్సిం దేనంటున్నా రు. కొద్ది కాలం వరకు అవి సరిపోయినా, కేసులు ఇలాగే పెరుగుతూపోతే మాత్రం అవి కూడా సరిపోవని చెబుతున్నారు.అయితే, తమ వద్ద 5 లక్షల మందికి సరిపడా వ్యాక్సిన్ డోసులున్నాయని మెర్క్​ చెబుతోంది. మరిన్నివ్యాక్సిన్లను తయారు చేస్తామని చెప్పిం ది. ప్రస్తుతం కంపెనీ దగ్గర 15 లక్షల డోసులున్నా యి. కానీ,కాం గో, గినియాల్లో కోటి మంది దాకా ఎబోలారోగులున్నారు. కాబట్టి ఆ డోసులు ఏ మూలకూరావన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే,జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్లను రోగులకే కాకుండా, ఇతర ప్రాంతాల్లో ని మామూలు మనుషులకు ఇవ్వాలని నిపుణులు చెబుతున్నారు. దాని వల్ల అది వేరే ప్రాంతాలకు సోకకుండా రక్షణ గోడ కట్టినట్టవుతుందని అంటున్నా రు.

కాంగో నమ్మట్లేదు…

కాంగో ప్రభుత్వం మాత్రం ఆ వ్యాక్సిన్ పై ఆందోళన వ్యక్తం చేస్తోంది. రెండు వ్యాక్సిన్లను ఒకేసారి వాడడం ఎంతో సంక్లిష్టమైన పని అంటోంది. ఎబోలా సోకిన వాళ్లు ఈ రెండు వ్యాక్సిన్ల వల్ల తికమకపడే అవకాశం ఉందని, కాబట్టి మందుపై నమ్మకంపోయే ప్రమాదం ఉంటుందని చెబుతోంది. కొత్త వ్యాక్సిన్ ను 56 రోజుల్లో రెండు సార్లు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ, ఎక్కడో విసిరేసినట్టు అభద్రతాభావంలో ఉండే కాంగో జనానికి మందునివ్వడం చాలా కష్టంతో కూడుకున్న పనేనంటోంది ఆ దేశ ప్రభుత్వం .

అదే మొదటి వ్యాక్సిన్….

ఎబోలా విజృంభించి నప్పుడు మెర్క్​ అండ్కో అనే కంపెనీ ఎబోలాకు మొదటి వ్యాక్సిన్ ను తీసుకొచ్చింది. 2015లో గినియాలో ఆవ్యాక్సిన్ ను ప్రవేశపెట్టింది. అప్పటికి దానికి లైసెన్స్ రాలేదు. పైగా వేరే మందులూ లేవు. అందుకే మానవతా దృక్పథంతో ఆ మందును రోగులు, మామూలు మనుషులకు ఇచ్చేలా ఆ దేశ ప్రభుత్వం అంగీకరించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WUHO) కూడా ఆ మందు బాగా పని చేసిందని తేల్చింది. దాని సక్సెస్ రేటు 97.5 శాతమని పేర్కొంది. వ్యాక్సిన్ ఇవ్వని వాళ్లతో పోలిస్తే ఇచ్చిన వాళ్లలో మంచి ఫలితాలు కనిపించాయని చెప్పింది. అయితే, దానికి లైసెన్స్ వచ్చేలా మరిన్ని టెస్టులు చేయాల్సి ఉందని తెలిపింది. ఇప్పుడు జాన్సన్ అండ్ జాన్సన్ తయారు చేసిన ఈ రెండో వ్యాక్సిన్ పరిస్థితి కూడా అలాగే ఉంది. ఇప్పటి కే కొన్ని పరీక్షల్లోఆ వ్యాక్సిన్ మెరుగ్గా పనిచేసిందని తేలడంతో,లైసెన్స్ లేకపోయినా దానిని వాడాలన్న నిర్ణయానికి వస్తున్నారు.

Latest Updates