నా టాలెంట్ ను సరిగా దొంగిలించండి.. సాహోకు హాలీవుడ్ దర్శకుడి పంచ్

ప్రభాస్ సాహో మూవీని ఫ్రెంచ్ యాక్షన్ థ్రిల్లర్ ‘లార్గో వించ్’ సినిమా నుంచి ఇన్ స్పైర్ తీశారని ట్రేడ్ విశ్లేషకులు చెబుతూ వచ్చారు. ఐతే.. సాహో సినిమాపై లార్గో వించ్ మూవీ డైరెక్టర్ జీరోమ్ సాలే సోషల్ మీడియాలో స్పందించారు. లార్గో వించ్ ను ఆధారంగా చేసుకుని ఫ్రీమేక్ అయిన రెండో సినిమా సాహో అని ఆయన అన్నారు. మొదటి సినిమా అజ్ఞాతవాసిలాగే సాహో కూడా ఏమాత్రం బాగా తీయలేదని అన్నారు. “తెలుగు డైరెక్టర్లకు ఓ విషయం చెప్పదల్చుకున్నా.. నా పనిని, టాలెంట్ ను దొంగతనం చేయాలనుకుంటే.. కనీసం ఆ పనిని జాగ్రత్తగా చేయండి” అని అన్నారు జీరోమ్ సాలే.

అజ్ఞాతవాసి సినిమా అప్పుడు కూడా జీరోమ్ స్పందించారు. దురదృష్టవశాత్తూ ఆ సినిమా చూడాల్సి వచ్చిందని అన్నారాయన.

తాజాగా సాహో సినిమాపై జీరోమ్ స్పందించడంతో.. ప్రభాస్ ఫ్యాన్స్ రెచ్చిపోయి రివర్స్ కౌంటర్ ఇస్తున్నారు. తండ్రి చావుకు ప్రతీకారం తీర్చుకునే కొడుకు కథ లార్గో వించ్ మాత్రమే కాదు.. అంతకుముందు కూడా వచ్చాయని అంటున్నారు. లార్గో వించ్ అనేది సక్సెస్ కాలేదనీ.. ఆ సినిమాను తెలుగు దర్శకులు ఎందుకు కాపీకొడుతున్నారో అర్థంకావడం లేదని మరికొందరు అంటున్నారు.

Latest Updates