బుమ్రా ప్రపంచంలోనే నంబర్ వన్ బౌలర్

భారత బౌలర్ జస్పిత్ బుమ్రాపై శ్రీలంక ఆటగాడు లసిత్ మలింగ ప్రశంసలు కురిపించాడు. బుమ్రా ప్రపంచంలోనే నంబర్ వన్ ఆటగాడన్నాడు. బుమ్రాకు బౌలింగ్ లో హెల్ప్ చేసినందుకు తనకు సంతోషంగా ఉందన్నారు. అతడి విజయంలో తన ప్రమేయం ఉన్నందుకు హ్యాపీగా ఉందన్నాడు. ప్రతీ సీనియర్ ఆటగాడు జూనియర్స్ తో తమ అనుభవాలను పంచుకుంటే క్రికెట్ విజయ వంతం అవుతుందన్నాడు. బుమ్రా  బౌలింగ్ లో కొత్త మెళకువలను నేర్చుకోవడానికి ఎప్పుడూ ముందుంటాడన్నాడు. ప్రత్యర్థులను ఇబ్బందిపెట్టడంలో బుమ్రా వేసే బంతుల ఎంపిక తనకన్నా బాగుంటుందని కొనియాడారు.

 

Latest Updates