ఇంటర్నేషనల్ క్రికెట్ చరిత్రలో ఒకే ఒక్కడు మలింగ

న్యూజిలాండ్ తో జరిగిన టీ20 మ్యాచ్ లో  శ్రీలంక బౌలర్ లసిత్ మలింగ్ మరో  రికార్డ్ సృష్టించాడు. ఇంటర్నేషనల్ క్రికెట్లో ఐదు సార్లు హ్యాట్రిక్ సాధించిన ఒకే ఒక్క క్రికెటర్ కూడా మలింగ రికార్డ్ సృష్టించాడు.  ఇంటర్నేషనల్ క్రికెట్  టీ20ల్లో 100 వికెట్లు తీసిన ఏకైక క్రికెటర్ కూడా మలింగనే. అంతేగాకుండా టీ20ల్లో రెండు సార్లు హ్యాట్రిక్ సాధించాడు మలింగ. శుక్రవారం న్యూజిలాండ్ తో జరిగిన టీ20 మ్యాచ్ లో మలింగ ఒకే ఒవర్లో నాలుగు వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్ లో 126 పరుగుల టార్గెట్ తో బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్ 88 పరుగులకే ఆలౌట్ అయ్యింది. మలింగ వన్డేల్లో మూడు సార్లు, టీ20ల్లో రెండు సార్లు హ్యాట్రిక్ సాధించాడు.

 

Latest Updates