తగ్గుతున్న సివిల్స్ కొలువులు

Last 5 years forty percent postings down in UPSC
  • ఐదేళ్లలో 40 శాతం తగ్గిన యూపీఎస్సీ నియామకాలు
  • రిజర్వేషన్ మెలికతో బ్యాక్ లాగ్ అవుతున్నాయంటున్న అధికారులు
  • కంప్యూటరైజేషన్ తో ఐఆర్ఎస్ కు అడ్డంకులు
  • జీఎస్టీతో ప్రభావం మరింత పెరిగిందంటున్ననిపుణులు

సివిల్స్ .. కొన్ని వేల మంది కల. కానీ, నోటిఫికేషన్ ఇస్తున్నది, సెలెక్ట్ చేస్తున్నది వందల్లోనే. అది కూడా ఏటికేడు తగ్గిపోతోంది. ప్రభుత్వం అవసరాన్ని బట్టి నంబర్ చెప్పినా.. కర్ణుడి చావుకు కారణాలనేకమన్నట్టు ఆ నంబర్ లోనూ కోతలు పడుతున్నాయి. 2014 నుంచి ఇప్పటి దాకా ఏటా నియామకాల్లో కోత పడుతూనే ఉంది. ఆ ఏడాదితో పోలిస్తే ఇప్పుడు సివిల్స్ కొలువులు 40 శాతం తగ్గిపోయాయి. 2014లో 1236 మందిని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ఎంపిక చేస్తే 2018లో కేవలం 759 మందినే తీసుకుంది. 2015, 2016, 2017లలో వరుసగా 1078,1099, 990 మందిని నియమించిం ది. 2019 (అంటే ఈ ఏడాది)లో నిర్వహించే సివిల్స్ ఫలితాలు 2020లో వస్తాయి. 896 మందిని ఎంపిక చేసే అవకాశాలున్నాయి. ఐఏఎస్ , ఐపీఎస్ , ఐఎఫ్ఎస్ లతో పాటు దేశంలో అనేక ఉద్యోగాలకు యూపీఎస్సీనే నియామక ప్రక్రియను చేపడుతుంది. ఎంత మందిని తీసుకోవాలన్న విషయంలో యూపీఎస్సీకి అధికారం లేదు.

ప్రభుత్వం ఎన్ని పోస్టులకు క్లియరెన్స్ ఇస్తుందో అన్ని పోస్టులకే నోటిఫికేషన్ ఇస్తుంది. అయితే, ఆ సంఖ్యలో అభ్యర్థుల మెరిట్ ను బట్టి ఎంత మందిని తీసుకోవాలో నిర్ణయించేది మాత్రం కమిషనే. ఓ యూపీఎస్సీ అధికారి ఇదే విషయం చెప్పారు. నిజానికి ఏటా ఇచ్చిన నోటిఫికేషన్ కంటే ఎంపికైన అభ్యర్థుల సంఖ్య తక్కువగా ఉంటోంది. 2018నే తీసుకుందాం.. ప్రభుత్వం 812 వెకెన్సీలున్నాయని చెబితే.. చివరాఖరుకు 759మందినే షార్ట్ లిస్ట్ చేసింది యూపీఎస్సీ. కారణం, దాని వెనక పకడ్బందీ ఫార్ములా ఉందని ఆ అధికారిచెప్పారు. ‘‘చాలా  సందర్భాల్లో రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థులు జనరల్ కేటగిరీలోనూ అర్హత సాధిస్తున్నారు.  రిజర్వేషన్ కేటగిరీలో మంచి పోస్టు దొరికితే..వెంటనే జనరల్ ను పక్కనబెట్టేస్తున్నారు . దాని వల్ల జనరల్ కేటగిరీలో ఖాళీలు ఏర్పడుతున్నాయి” అని ఆయన తెలిపారు. ఇది ఎప్పటి నుంచో నడుస్తున్న వ్యవహారమన్నారు. సిబ్బంది వ్యవహారాల శాఖ వెకెన్సీలను రిలీజ్ చేసిన దగ్గర నుంచి ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే నియామకాలు కొనసాగిస్తున్నామన్నారు .

జవాబు లేని ప్రశ్న

ఏటా ఆలిండియా సర్వీ సెస్ (ఐఏఎస్ , ఐపీఎస్ , ఐఎఫ్ఎస్ )తో పాటు సెంట్రల్ సివిల్ సర్వీ సెస్ (గ్రూప్ ఏ,గ్రూప్ బీ)లోని జాబ్ లనూ యూపీఎస్సీ భర్తీ చేస్తుంది. ఆ సర్వీ సెస్ అన్నింట్లోనూ ఖాళీలు చాలానే ఉన్నాయి. సిబ్బంది వ్యవహారాల శాఖ లెక్కల ప్రకారం 1149 ఐఏఎస్ పోస్టులు, 970 ఐపీఎస్ పోస్టులు, 560 ఐఎఫ్ఎస్ పోస్టులు ఇప్పటికీ ఖాళీగానే ఉన్నాయి. అయితే, ఐదేళ్లుగా ఆ మూడు విభాగాల్లోనూ నియామకాలు స్థిరంగా ఉన్నాయి. మరి, ఖాళీలు ఎక్కువగా ఉన్నా ప్రభుత్వం మాత్రం ఎందుకు నియామకాలను తగ్గిస్తోందన్నది సమాధానం లేని ప్రశ్నే. అధికార యంత్రాంగం తక్కువుండాలని ప్రధాని నరేం ద్ర మోడీ భావిస్తున్నారంటూ వాదించేవాళ్లు లేకపోలేదు. ప్రభుత్వం మాత్రం ఆ ఖాళీలన్నింటిని ఒకట్రెండు సంవత్సరాల్లో భర్తీ చేయడం సాధ్యం కాని పని అని చెబుతోం ది.‘‘ఒకేసారి ఖాళీలను భర్తీ చేయాలని ప్రయత్నిస్తే. దీర్ఘకాలంలో కేడర్ నిర్వహణ సమస్యలొస్తాయి. ప్రతి అధికారికి సగటున 30 నుంచి 35 ఏళ్ల సర్వీస్ ఉంటుంది.కానీ, ఉన్నత స్థానా లు కొన్నే ఉంటాయి. కాబట్టి సీనియారిటీని బట్టి అధికారులకు ప్రమోషన్లు ఇస్తూ మిగిలిన వాటిని భర్తీ చేస్తూ పోతున్నాం. అలా అయితే, అధికారుల్లోనూ అసంతృప్తి అనే మాట రాదు” అని సిబ్బంది వ్యవహారాల శాఖ అధికారి ఒకరు చెప్పారు.

ఐఆర్ఎస్ లు తగ్గుతున్నరు

ఇండియన్ రెవెన్యూ సర్వీ సెస్ (ఐఆర్ ఎస్ ), ఇండియన్పోస్టల్ సర్వీ సెస్ , ఇండియన్ స్టా టిస్టికల్ సర్వీ స్ లుం డేగ్రూప్ ఏలో 15 వేలకు పైగా ఖాళీలున్నాయి. ఆర్మ్ డ్ఫోర్సె స్ హెడ్ క్వా ర్టర్స్ సి విల్ సర్వీ స్ , పాం డిచ్చేరిసివిల్ సర్వీ సులుం డే గ్రూప్ బీలో 26 వేలకు పైగా ఖా-ళీలున్నాయి. అన్ని ఖాళీలున్నా నియామకాలు మాత్రం చాలా తక్కువగా అవుతు న్నాయి. 2014లో 710గ్రూప్ ఏ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇస్తే,2018కి వచ్చేటప్పటికి అది 384కు పడిపోయిం ది.ఏ సర్వీ స్ తీసుకున్నా ఎక్కువ కోతలు ఐఆర్ ఎస్ కే పడు-తున్నాయని అధికారులు చెబుతున్నారు . ఆ శాఖకుసంబంధించి న ఖాళీలే ఎక్కువగా ఏర్పడుతున్నాయం-టున్నారు . డిజిటైజేషన్ , కంప్యూటరైజేషన్ , డేటా నెట్వర్కిం గ్ పెరిగిపోవడంతో ఐఆర్ ఎస్ అధికారులఅవసరం తగ్గుతోం దంటున్నారు. జీఎస్ టీ అమలుతోఆ ప్రభావం మరిం త ఎక్కువైందని వివరిస్తున్నారు .సర్వీ స్ రూపు రే ఖలు మారుస్తు న్న నేపథ్యం లోనే కొత్తరి క్రూట్ మెంట్లు తగ్గుతు న్నాయని చెబుతున్నారు .గ్రూప్ బీ సర్వీ స్ దీ అదే బాట. 2014 నుంచి 2018వరకు వరుసగా 292, 61, 231, 121, 68 ఖాళీలకుప్రభు త్వం నోటిఫికేషన్ ఇచ్చిం ది. ఇక్కడ ట్రెండ్మాత్రం తగ్గడం, పెరగడమంటూ లేదు. ఒక ఏడాదిరిక్రూట్ మెం ట్ పెరిగితే.. ఇంకో ఏడాది తగ్గింది.దానికి కారణముందని అధికారులు చెబుతున్నారు .ఒక ఏడాది ఎక్కువ మందిని తీసుకుం టే.. మరుసటి ఏడాది ఆ సంఖ్య తగ్గుతుందని వివరించారు.

Latest Updates