ఇవాళ పరిషత్ చివరి పోలింగ్

రాష్ట్రంలో మూడో విడత పరిషత్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది.  ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్… సాయంత్రం 5 గంటల వరకు కొనసాగునుంది. 27 జిల్లాల్లో మొత్తం 9 వేల, 494 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు ఎన్నికల అధికారులు. మూడో విడతలో 30 MPTCలు, ఒక జడ్పీటీసీ స్థానం ఏకగ్రీవం అవ్వగా…. 160 ZPTC, 17 వందల 8 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ కొనసాగుతోంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన మంచిర్యాల, కమ్రంభీం ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది.

160 జడ్పీటీసీ స్థానాలకు 741 మంది అభ్యర్థులు, 1708 ఎంపీటీసీ స్థాలకు  5 వేల 726 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. తొలి విడతలో వాయిదా పడిన సిద్దిపేట జిల్లా అల్వాల్, రంగారెడ్డి జిల్లాలోని అజీజ్ నగర్ MPTC స్థానాలకు ఇవాళ పోలింగ్ జరగుతోంది. పోలింగ్ కేంద్రాల దగ్గర పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ నెల 27న మూడు దశలల ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.

Latest Updates