రూ.25 లక్షల విరాళం ప్రకటించిన లతా మంగేష్కర్‌

కరోనా వైరస్‌పై పోరాటంలో భాగంగా ప్రభుత్వాలు చేస్తున్న సహాయక చర్యలకు.. తోడుగా నిలుస్తున్నారు సినీ సెలబ్రిటీలు. ఇప్పటికే పలువురు సినీ సెలబ్రిటీలు పీఎం సహాయనిధితో పాటు రాష్ట్ర సీఎంల సహాయనిధికి భారీగా విరాళాలు అందించారు. లేటెస్టుగా బాలీవుడ్ సింగర్ లతా మంగేష్కర్‌ మహారాష్ట్ర సీఎం రిలీఫ్ ఫండ్ కు రూ.25 లక్షల విరాళాన్ని అందిస్తున్నట్టు ప్రకటించారు. మహారాష్ట్రలో కరోనా వైరస్‌ను అరికట్టడంలో తన వంతు భాగంగా లతా మంగేష్కర్‌ విరాళం ప్రకటించారు.

Latest Updates