ధోనీ జీ.. రిటైర్ కావొద్దు : లతా మంగేష్కర్ విన్నపం

టీమిండియా దిగ్గజ ఆటగాడు, ఇండియాకు వరల్డ్ కప్ అందించిన మేటి కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ రిటైర్ కాబోతున్నారనే వార్త క్రికెట్ ప్రపంచంలో హాట్ టాపిక్ అయిపోయింది. ధోనీ నుంచి ఎటువంటి ప్రకటన రాకపోయినప్పటికీ… ఈ మెగా టోర్నీకోసమే 38 ఏళ్ల ధోనీ కొన్నాళ్లుగా ఎదురుచూస్తూ వస్తున్నారు. టెస్ట్ క్రికెట్ కు ఏనాడో గుడ్ బై చెప్పారు. వన్డే ఫార్మాట్ లో కొనసాగుతూ వస్తున్నారు. ఐతే… మెగాటోర్నీలో భారత్ జర్నీ పూర్తికావడంతో.. ధోనీ రిటైర్ కాబోతున్నారనే వార్తపై ఎక్కువగా చర్చజరుగుతోంది.

లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ ధోనీ రిటైర్మెంట్ వార్తలపై స్పందించారు. “నమస్కారం ధోనీ జీ.. మీరు రిటైర్ కాబోతున్నారనే వార్త వింటున్నా. దయచేసి మీరు అలాంటి ఆలోచన చేయొద్దు. దేశానికి మీ ఆట చాలా అవసరం. రిటైర్మెంట్ అనే ఆలోచన కూడా మీ మనసులోకి రానీయొద్ది నేను విజ్ఞప్తి చేస్తున్నా” అని లతా మంగేష్కర్ ట్వీట్ చేశారు.

Latest Updates