వెయ్యి పీపీఈ కిట్ల విరాళం.. థ్యాంక్స్ చెప్పిన లతా మంగేష్కర్

ముంబై: పుణెలోని దీననాథ్ మంగేష్కర్ ఆస్పత్రికి ఒక వెయ్యి పీపీఈ కిట్లను విరాళంగా ఇచ్చినందుకు వికాస్ ఖన్నాకు.. ప్రముఖ సింగర్ లతా మంగేష్కర్ కృతజ్ఞతలు తెలిపారు. తన తండ్రి ప్రఖ్యాత సంగీతకారుడు, మరాఠీ సినీ హీరో దీననాథ్ మంగేష్కర్ జ్ఞాపకార్థం ఆస్పత్రిని 2001 లో లతా మంగేష్కర్ స్థాపించారు. ‘‘మిచెలిన్ స్టార్ చెఫ్​వికాస్ ఖన్నా వెయ్యి పీపీఈ కిట్లను విరాళంగా ఇచ్చారు. మంగేష్కర్ ఫ్యామిలీ నుంచి మీకు కృతజ్ఞతలు”అని లతా మంగళవారం ట్వీట్ చేశారు.

Latest Updates