మెదక్ అడిషనల్‌ కలెక్టర్ నగేష్ కేసు : కింది స్థాయి ఉద్యోగులపై అనుమానాలు

మెదక్ అడిషనల్‌ కలెక్టర్ నగేష్ కేసులో ఏసీబీ అభికారులు రిమాండ్ రిపోర్ట్ ను విడుద‌ల చేశారు.ఏసీబీ అధికారులు తెలిపిన వివారాల ప్ర‌కారం..

112.21ఎకరాల ఎన్వోసి మెదక్ అడిషనల్‌ కలెక్టర్ నగేష్ కేసులో కోటి 12ల‌క్ష‌లు డిమాండ్ చేసిన‌ట్లు ఏసీబీ తెలిపారు. పలుమార్లు ఎన్వోసీ కోసం భూ యజమానులు అప్ల‌య్ చేసుకున్నారు.

అయితే 112.21ఎక‌రాల ల్యాండ్ కు ఎన్వోసీ ఇచ్చేందుకు అడిష‌నల్ క‌లెక్టర్ న‌గేష్ ఒప్పుకున్నారు. అందుకు గాను త‌న‌కి రూ.కోటి 12లక్షలు ఇవ్వాల‌ని న‌గేష్ డిమాండ్ చేసిన‌ట్లు అధికారులు తెలిపారు.

ఒప్పొందంలో భాగంగా బాధితుల నుంచి నగేష్ రూ.40లక్షలు అడ్వాన్స్ ను రెండు సార్లు తీసుకున్న‌ట్లు తేలింది.మిగిలిన రూ.72లక్షల్ని త‌న బినామి జీవ‌న్ గౌడ్ పేరుమీద 5ఎక‌రాల్ని అగ్రిమెంట్ ఆఫ్ సేల్ రాయించుకున్నారు.

న‌గేష్ త‌న నివాసం బాధితుని నుండి ఎనిమిది బ్లాంక్ చెక్కులు, 5ఎకరాల అగ్రిమెంట్ పేపర్స్ స్వాదీనం చేసుకున్నారు. అనంత‌రం ఎలాంటి ఫిజికల్ వెరిఫికేషన్ లేకుండానే ఎన్వోసీ కోసం అడిషనల్ కలెక్టర్ నగేష్ రిపోర్ట్ పంపినట్లు నిర్ధారించారు.

రెవిన్యూ అధికారులతో జరిగిన సంప్రదింపుల మొత్తాన్ని బాధితులు రికార్డ్ చేసిన‌ట్లు చెప్పిన ఏసీబీ అధికారులు.. 1.12 లక్షల్లో కలెక్టర్ కు ఇవ్వాలని మెద‌క్ క‌లెక్ట‌ర్ ధ‌ర్మారెడ్డి కి ఇవ్వాల‌ని అడిష‌న‌ల్ క‌లెక్ట‌ర్ న‌గేష్ బాధితుల‌తో ప్ర‌స్తావించార‌ని అన్నారు.

విచార‌ణ‌లో A1 అడిషనల్ కలెక్టర్ నగేష్, A2 వసీం అహ్మద్, A3 ఆర్డీవో అరుణా రెడ్డి, A4 ఎమ్మార్వో సత్తార్, A5 భినామి జీవన్ గౌడ్ ల‌పై u/s 7(a)b sec 12& 13(1)a(b) of pc act1988 sec120-B r/w సెక్ష‌న్ల కింద కేసులు న‌మోదు చేసిన‌ట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.

కింది స్థాయి ఉద్యోగుల పాత్రపై అనుమానాలు తలెత్త‌డంతో కేసు ద‌ర్యాప్తును వేగంవంతం చేశారు ఏసీబీ అధికారులు.

Latest Updates