సాహో వేడుకలో ఫ్యాన్స్‌పై లాఠీచార్జ్.. పోలీసులు సీరియస్

lathi-charge-on-fans-in-saaho-event

రామోజీ ఫిలింసిటీలో సాహో సినిమా ఈవెంట్ లో స్వల్పంగా ఉద్రిక్తత ఏర్పడింది. ప్రోగ్రామ్ ప్రారంభానికి ముందు అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించారు. వేదిక ముందువైపుకు దూసుకొచ్చారు. ఫ్యాన్స్, వీఐపీ గ్యాలరీల్లోకి భారీసంఖ్యలో తోసుకుంటూ వచ్చారు. అక్కడున్న ఫెన్సింగ్ ను దాటుకుని వేదిక ముందుకు వచ్చేందుకు ప్రయత్నించారు. ఈ సమయంలో పోలీసులు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ లాఠీలకు పనిచెప్పారు. అభిమానులను లైన్ అవతలకు లాఠీలతో కొడుతూ తరిమారు.

వేడుకలో ఫ్యాన్స్ సంయమనం పాటించాలని నిర్వాహకులు ప్రాధేయపడ్డారు. ఫ్యాన్స్ ను కంట్రోల్ చేయడం ఇబ్బందిగా ఉందని… ఈవెంట్ క్యాన్సిల్ చేయాలని పోలీసులు హెచ్చరించినట్టుగా నిర్వాహకులు అనౌన్స్ చేశారు. అభిమానులు సపోర్ట్ చేస్తేనే ఈవెంట్ జరుగుతుందని… పొరుగురాష్ట్రాలనుంచి తరలివచ్చిన అభిమానులు ఓపికతో ఉండాలని.. ఫెన్సింగ్ లు , బారికేడ్లు దాటుకుని రావొద్దని కోరారు.

 

Latest Updates