నమ్మి పంపితే పన్నెండేళ్ళ అమ్మాయి పై అత్యాచారయత్నం

హైదరాబాద్: తనకు కూతురు వయసున్న బాలికపై అత్యాచారయత్నం చేశాడు ఓ మేస్త్రీ. తన దగ్గర కూలి పనులు చేసే దంపతుల కుమార్తే(12)పై కన్నేసిన మేస్త్రీ చివరకు కటకటాల పాలయ్యాడు. ఈ సంఘటన మల్కాజిగిరిలో జరిగింది.

వివరాలు..

మల్కాజిగిరిలో నివసించే దంపతులు హిల్‌ టాప్‌ కాలనీలో నివసించే మేస్త్రీ పైసా నర్సింగ్‌ రావు(44) దగ్గర భవన నిర్మాణ కార్మికులుగా పని చేస్తారు. వారికి ఇద్దరు పిల్లలు. కుమారుడికి జ్వరం రావటంతో డాక్టర్ కి చూపించారు. డాక్టర్ రాసిచ్చిన మందులను ఇంటికి తీసుకువచ్చి జ్వరంతో బాధపడుతున్న కుమారుడికి వేసేందుకు ఆయన ఆదివారం ఉదయం తనవెంట కుమార్తె(12)ను తీసుకు వచ్చాడు. మెడికల్‌ దుకాణంలో మందులు తీసుకున్న తర్వాత తను పనికి వెళ్లాల్సి ఉండడంతో ఆమెను ఒంటరిగా ఇంటికి పంపేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో మేస్త్రీ నర్సింగ్‌ రావు అక్కడ కనిపించాడు.

తెలిసిన వ్యక్తే కదా అన్న నమ్మకంతో కుమార్తెను ఇంటి వద్ద దింపాలని చెప్పాడు. ఇంటికి వచ్చిన తర్వాత మద్యం మత్తులో ఉన్న నర్సింగ్‌ రావు బాలికపై అత్యాచారానికి యత్నించాడు. ఆమె పెద్దగా కేకలు వేయడంతో స్థానికులు అక్కడకు రావటాన్ని గమనించి మేస్త్రీ పారిపోయాడు. ఈ సంఘటనపై బాధితురాలి తల్లి మంగళవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసును విచారించిన పోలీసులు నిందితుడ్ని గురువారం అతడి ఇంటి దగ్గర అదుపులోకి తీసుకున్నారు.

Latest Updates